DailyDose

ఢిల్లీలో ఉగ్రదాడుల జరగవచ్చు-నేరవార్తలు

TNILIVE Crime News Roundup Today || Terrorist Attacks Can Happen In Delhi

* విడపనకల్లు మండలం పాల్తూరు పిఎస్ పరిధిలో ఉండబండ వీరభద్రస్వామి దేవాలయం వద్ద సోమవారం ఉదయం ఎదురు ఎదురుగా వచ్చిన రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి.

* చిత్తూరు జిల్లాకు చెందిన ప్రభుత్వ వైద్యురాలు అనితారాణి వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వంతో పాటు సీఐడీని కోర్టు ఆదేశించింది.సీబీఐతో విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్​ కోరారు.తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.చిత్తూరు జిల్లా పెనుమూరు ఆస్పత్రిలో జరిగిన అవకతవకలపై సీబీఐతో విచారణ చేయించాలని వైద్యురాలు అనితారాణి ఉన్నతన్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే.

* దేశ రాజధానిలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

* జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసు. జేసీ ప్రభాకర్రెడ్డి అశ్వితలకు ఈ నెల 25దాకా రిమాండ్. కడప సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు.

* క్రైమ్ ఇండియా రిపోర్టర్ గంటా నవీన్ హత్య కు ప్రేరేపించిన అసలు ముద్దాయిలను అరెస్టు చేయాలని నవీన్ కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని నందిగామ జర్నలిస్టు స్థానిక గాంధీ సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

* 108 అంబులెన్సుల వ్యవహారంలో కుంభకోణం జరిగినట్లు సాక్ష్యాలతో సహా బయటపెట్టామని తెదేపా నేత దేవినేని ఉమా మహేశ్వరరావు వెల్లడించారు. కుంభకోణంలో రూ.300 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు.

* అనంతపురంఆర్​అండ్​బీ కార్యాలయంలో ఉన్నతాధికారి వల్ల ఇద్దరు చనిపోయారని ఉద్యోగులు ధర్నా చేశారు.ఎస్ఈ శ్రీనివాసులు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఉద్యోగులు వాపోయారు.కరోనా సమయంలోనూ సమయపాలన లేకుండా కార్యాలయానికి రావాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.గతంలోనూ ఈయన వేధింపులకు గురైన ఇద్దరు ఉద్యోగులు ఒత్తిడి తట్టుకోలేక అనారోగ్యానికి గురై మరణించారని ఆరోపించారు.విధులకు హాజరు కాకపోతే..సస్పెన్షన్ వచ్చేలా చేస్తానని భయపెడుతున్నాడని వారు తెలిపారు.ఎస్ఈ వేధింపుల నుంచి తమకు న్యాయం చేయాలని కోరారు.

* బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని పోలీసులు అరెస్ట్ చేసారు. కోఠిలోని కరోన కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ముట్టడించేందుకు యత్నించిన ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు మరికొందరు కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కరోనాను ఆరోగ్య శ్రీ కింద చేర్చాలని డిమాండ్ చేశారు.