Editorials

నేపాల్‌కు చైనా వెన్నుపోటు

నేపాల్‌కు చైనా వెన్నుపోటు

నేపాల్ కు షాక్.. నదుల మార్గాన్ని మార్చి భూభాగాన్ని ఆక్రమించిన చైనా!

నేపాల్ కు చైనా షాక్ ఇచ్చింది. టిబెట్ లో రోడ్డు విస్తరణ చేపట్టిన చైనా… పనిలోపనిగా నేపాల్ కు చెందిన 33 హెక్టార్లకు పైగా భూభాగాన్ని ఆక్రమించింది. ఆక్రమిత భూమిలో ఔట్ పోస్టులను నిర్మించబోతోందని సమాచారం. నేపాల్ వ్యవసాయశాఖకు చెందిన సర్వే విభాగం ఈ విషయాన్ని నివేదికలో పేర్కొంది.

ఇరు దేశాల మధ్య సహజసిద్ధంగా ఉన్న నదుల గమనాన్ని మార్చడం ద్వారా.. నేపాల్ లోని 10 ప్రాంతాలకు చెందిన 33 హెక్టార్ల భూమిని చైనా ఆక్రమించుకుంది. సర్వే విభాగం ఇచ్చిన నివేదికతో నేపాల్ ప్రభుత్వం షాక్ కు గురైంది. మరోవైపు నివేదికలోని అంశాలు ప్రభుత్వాన్ని మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. భవిష్యత్తులో మరింత భూభాగాన్ని కూడా చైనా ఆక్రమించే అవకాశం ఉందని సర్వే పేర్కొంది.

ఇటీవలి కాలంలో చైనా ప్రోద్బలంతో నేపాల్ భారత్ మీద ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. భారత్ కు చెందిన ప్రాంతాన్ని తన భూభాగంగా పేర్కొంటూ కొత్త మ్యాపును రూపొందించింది. దీనికి ఆ దేశ పార్లమెంటు ఆమోదముద్ర కూడా వేసింది. ఈ నేపథ్యంలో, చైనా నైజమేంటో ఆ దేశానికి ఇప్పుడు అర్థమై ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.