Food

బాలింతలకు పాలుపట్టేందుకు ఉపయోగపడే ఆహారం ఇది

ఈ 10 ఫుడ్ ఐటెమ్స్ తింటే బాలింతలకు పాలు పడతాయి..

పుట్టిన పిల్లలకి తల్లిపాలు ఎంతో ఆరోగ్యకరం. కానీ, కొంతమంది తల్లులకి సరిపడా పాలు రావు. అలాంటప్పుడు కొన్ని ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల పాలు పడతాయి. అవేంటో తెలుసుకోండి..

తల్లిపాలు బిడ్డకి ఎంతో శ్రేష్టమైనవి. బిడ్డ శారీరక మానసిక ఎదుగుదలకి కావాల్సినవన్నీ తల్లిపాలలో పుష్కలంగా ఉంటాయి. తల్లిపాలు బిడ్డని అనేక ఇన్‌ఫెక్షన్స్, ఎలర్జీలు, అస్థ్మా, మరీ ముఖ్యం గా జలుబు నుంచి రక్షిస్తాయి. అందుకనే బిడ్డకి ఆరు నెలలు నిండే వరకూ తల్లిపాలు ఇవ్వడం చాలా మంచిది. బిడ్డకి పాలివ్వడం తల్లికి కూడా మంచిదే. కానీ, ఒక్కొక్కసారి తల్లి దగ్గర బిడ్డకి సరిపోయినంత పాలు ఉండవు. పాలు పడడానికి సహకరించే ఆహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్యని తేలికగా అధిగమించవచ్చు. అయితే, తల్లులకి సరిపడా పాలు పడాలంటే కొన్ని ఆహారపదార్థాలు తసుకోవాలి.. అవేంటో తెలుసుకోండి..

​1. ఓట్స్

ఓట్స్ తల్లిపాల క్వాంటిటీనీ, క్వాలిటీనీ కూడా మెరుగుపరుస్తాయి. డెలివరీ టైం లో జరిగే బ్లడ్ లాస్ వల్ల బాలింతలకి ఐరన్ డెఫిషియెన్సీ వస్తుంది. దాన్నించి ఎనీమియా వస్తుంది. ఓట్స్ ఈ ఎనీమియా రాకుండా చేస్తాయి. క్విక్ ఓట్స్, స్టీల్-కట్ ఓట్స్ మంచివే కానీ, ఇన్స్‌స్టంట్ ఓట్స్ మాత్రం తీసుకోవద్దు. అందులో పంచదార, ఉప్పు కలుపుతారు. ఓట్స్‌ని మామూలుగా పాలల్లో వేసుకుని అలాగే తినొచ్చు. కావాలనుకుంటే తేనె, ఏమైనా నట్స్, మీకు నచ్చిన ఫ్రూట్స్ కలిపి కూడా తినొచ్చు. ఓట్స్ బిస్కెట్స్ కూడా తినచ్చు.

​2. బాదం పప్పు

బాదం పప్పూ, జీడి పప్పూ, వాల్ నట్స్ వంటిని పాలిచ్చే తల్లులకి బాగా మేలు చేస్తాయి. వీటిలో ఉండే ప్రొటీన్, ఫైబర్, విటమిన్స్, మినరల్స్, యాంటీ-ఆక్సిడెంట్స్ తల్లికీ బిడ్డకీ కూడా మంచివి. పైగా వీటి ద్వారా కాల్షియం కూడా లభిస్తుంది. రోస్టెడ్, సాల్టెడ్ ఆల్మండ్స్ కాకుందా నానబెట్టి తొక్క తీసేసిన బాదంపప్పులు రోజుకి ఐదారు తీసుకోవచ్చు. వీటిని రాత్రి నానబెట్టి పొద్దున్నే తీసుకోవచ్చు. లేదా స్నాక్ గా కూడా తినచ్చు.

​3. కొబ్బరి నూనె

ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ గర్భవతులకీ, బాలింతలకీ కూడా మంచిది. ఇందులో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ పాలు పడడానికి సహకరిస్తాయి. ఈ ఆయిల్ ఇమ్యూనిటీ ని కూడా పెంచుతుంది. పాలిచ్చే తల్లులు రోజుకి ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె అయినా తీసుకుంటే మంచిది. ఈ ఆయిల్ ని సలాడ్ డ్రెసింగ్స్‌లో అయినా వాడొచ్చు.

​4. కమలా పండు

తల్లి ఎంత విటమిన్ సీ తీసుకుంటే తల్లి పాలలో అంత విటమిన్ సీ ఉంటుంది. అందుకే పాలిచ్చే తల్లులు విటమిన్ సీ ఎక్కువగా ఉన్న ఆహార పదార్ధాలు బాగా తినాలి. కమలాపండు లో విటమిన్ సీతో పాటూ విటమిన్ ఏ, విటమిన్ బీ, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఉన్నాయి. బిడ్డకి పాలిస్తున్నంత కాలం తల్లి రోజుకి రెండు గ్లాసుల ఆరెంజ్ జ్యూస్ తాగచ్చు.

​5. మెంతి కూర

మెంతులూ, మెంతి కూర బాలింతలకి మేలు చేస్తాయి. ఇందులో ఉండే ఐరన్, ఫైబర్, కాల్షియం, విటమిన్స్, మినరల్స్ తల్లికీ బిడ్డకీ కూడా మంచివి. పప్పుల్లో, కూరల్లో కొంచెం మెంతి పొడి వేసుకోవచ్చు. మెంతి కూర తో పప్పు చేసుకోవచ్చు, పులుసు పెట్టుకోవచ్చు. అయితే డయాబెటిక్ పేషెంట్స్, పీనట్ ఎలర్జీ ఉన్నవారు మెంతులు, మెంతి కూర తీసుకోకూడదు. అలాగే, ఇవి ప్రెగ్నెన్సీ టైం లో తీసుకోడం మంచిది కాదు.

​6. గుడ్లు

గుడ్లు టేస్టీ గా ఉంటాయి. హైలీ న్యూట్రిషియస్ కూడా. వీటిలో ప్రొటీన్, విటమిన్ బీ12, విటమిన్ డీ, రైబోఫ్లావిన్, ఫోలేట్, కోలీన్ ఉంటాయి. కోలీన్ చిన్న పిల్లల్లో బ్రెయిన్ డెవలప్మెంట్ కీ బాగా హెల్ప్ చేస్తుంది. నిజానికి, అసలు మనం ఎవ్వరం కూడా సరిపోయినంత కోలీన్ తీసుకోవడం లేదు. విటమిన్ డీ ఉండే అతి తక్కువ ఆహార పదార్ధాలో పచ్చ సొన కూడా ఒకటి. ఎగ్స్ లో ఉండే ప్రొటీన్ లో కావాల్సిన అన్ని ఎసెన్షియల్ ఎమినో ఆసిడ్స్ ఉన్నాయి. బాలింతలు రోజుకి రెండు ఎగ్స్ ఈజీగా తీసుకోవచ్చు. వీటిని బాయిల్ చేసి తీసుకోవచ్చు, స్క్రాంబుల్ చెయ్యచ్చు, ఆమ్లెట్, సలాడ్…ఎలాగైనా తినచ్చు.

​7. చేపలు

చేపలు, అందులోనూ సాల్మన్, ప్రెగ్నెంట్స్, బాలింతలు ఇద్దరికీ మంచివి. వీటిలో కూడా విటమిన్ డీ ఉంటుంది. బిడ్డ నెర్వస్ సిస్టం డెవలప్ అవ్వడానికి ఉపయోగపడే ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్ ఉంటుంది. వారానికి రెండు సార్లు సాల్మన్ తీసుకోవచ్చు. బేక్ చేసి గానీ, గ్రిల్ చేసి గానీ తినచ్చు. వీలున్నంత వరకూ వైల్డ్ సాల్మన్ కి ఆప్ట్ చెయ్యండి.

​8. క్యారెట్స్

ప్రెగ్నెన్సీ టైంలో బిడ్డకి పాలిస్తున్నప్పుడూ కూడా తల్లి కి విటమిన్ ఏ ఫుడ్స్ చాలా అవసరం. క్యారెట్స్ లో ఉన్న బీటా కెరొటిన్ వల్ల విటమిన్ ఏ లోపం లేకుండా ఉంటుంది. క్యారెట్ సూప్, క్యారెట్ సలాద్, లేదా క్యారెట్ జ్యూస్, క్యారెట్ కూర…అన్నీ మంచివే. ఎలాగైనా తీసుకోవచ్చు.

​9. పాలకూర

పాలకూరతో పాటూ మిగిలిన ఆకుకూరలు కూడా బాలింతలకి చాలా మంచిది. పాలకూర సిజేరియన్ ద్వారా బిడ్డని కన్న వారికి ఎంతో మేలు చేస్తుంది. అయితే, బాలింతలు మాత్రం వండిన పాలకూరనే తినాలి. పాలకూర పప్పు, ఊరు మిరపకాయలు మంచి కాంబినేషన్.డెలివరీ తరవాత ఎక్కువ బ్లడ్ పోకుండా ఉండడం, ప్రెగ్నెన్సీ టైమ్‌లో పెరిగిన బరువుని పోగొట్టుకోవడం వంటి ప్రయోజనాలు పాలిచ్చే తల్లులకి ఉంటాయి. పైగా వీరికి బ్రెస్ట్ కాన్సర్, ఆర్థ్రైటిస్, గుండె జబ్బులు వచ్చే రిస్క్ కూడా బాగా తగ్గుతుంది. అంతే కాకుండా బిడ్డకి పాలివ్వడం వల్ల తల్లికీ బిడ్డకీ మధ్య ఒక చక్కని మానసిక బంధం ఏర్పడుతుంది.

​10. బ్రౌన్ రైస్

వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ లో ఫైబర్, న్యూట్రియెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ వల్ల చాలా సేపు కడుపు నిండు గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది తల్లికీ బిడ్డకీ కూడా మంచిది. రోజుకి ఒక కప్పు వండిన బ్రౌన్ రైస్ లంచ్ లో గానీ, డిన్నర్ లో గానీ తినచ్చు. అయితే వండడానికి ముందు కొన్ని గంటలపాటూ బ్రౌన్ రైస్ ని నీటిలో నాన బెట్టడం వల్ల రైస్ ఈజీగా ఉడుకుతుంది. మామూలుగా వెల్లుల్లి, బార్లీ నీరు, జీల కర్రా… వంటివి పాలు బాగా ఉత్పత్తి అవ్వడానికి సహకరిస్తాయని అంటారు. దాంతో పాటూ, బ్రెడ్ పాలు కలిపి తీసుకోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లం రాదని అంటారు.