DailyDose

గుంటూరు తెదేపా నేతపై దాడి-నేరవార్తలు

గుంటూరు తెదేపా నేతపై దాడి-నేరవార్తలు

* గుంటూరులో తెదేపా నేతపై దాడి. మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో తెదేపా నేత షేక్ చింతపల్లి గౌస్ పై దాడి జరిగింది.రాయి, కర్రలతో కొట్టడంతో గౌస్ తల, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.అతన్ని కుటుంబ సభ్యులు పిడుగురాళ్లలోని ప్రైవైట్ ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం గౌస్​కు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నందునే దాడి జరిగినట్లు కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.

* చిత్తూరు జిల్లా….దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ ఏకాంబరం పై సస్పెన్షన్ వేటు…..ఆలయాల నిధులను దుర్వినియోగానికి చేశారని పై ఆరోపణలపై వచ్చిన, నివేదికల ఆధారం తో ప్రభుత్వం నిర్ణయం…..పుంగనూరు, మదనపల్లి, తదితర ప్రాంతాలలో ఉన్న ఆలయాల నిధులు కాజేశారని అటెండర్ చెంగమ్మను ఇప్పటికే సస్పెన్షన్.

* నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రి లో కలకలం రేగింది కరోన పాజిటివ్ నమోదైన వ్యక్తి ఆస్పత్రి నుండి పరారయ్యాడు.ఆరోగ్యం బాగోక దగ్గు జలుబుతో విజయవాడ కు చెందిన వ్యక్తి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స నిమిత్తం జాయిన్ అవ్వగా వైద్యపరీక్షల అనంతరం అతనికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో పరారైన వ్యక్తి.ప్రభుత్వ వైద్యుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు ఈ సందర్భంగా స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

* చెన్నేకొత్తపల్లి మండల ఎస్సై రమేష్ బాబు పక్కా సమాచారంతో 44వ జాతీయ రహదారిపై కర్ణాటక మద్యం తరలిస్తున్న రెండు ఐచర్ వాహనాలు ఒకటి 407 వాహనం ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్దనుండి 40 ఫుల్ బాటిల్ లు 210 టెట్రా ప్యాకెట్లు 150 గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు .

* సూళ్లూరుపేట మండలం కొల్లపట్టు గ్రామంలో గ్యాస్ లీక్ అవ్వడం వల్ల గురునాధం,అంకయ్యల మూడు ఇల్లు పూర్తిగా దగ్ధమయ్యినా సంఘటన బుధవారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇంటిలో ఉన్న సామాగ్రి పూర్తిగా కాలి బూడిద అయ్యాయి. సదరు ఇళ్ల కుటుంబ సభ్యులు వంద రోజులు పని కి పెళ్లి ఉండడంతో తిరిగి వచ్చేసరికి మూడు ఇల్లులు పూర్తిగా ఇంటిలో ఉన్న సామాన్లు మొత్తం బట్టలు, నిత్యావసర సరుకులు, ఇంట్లో ఉన్న వస్తువులు మొత్తం మంటల్లో ఖాళీ బూడిద అయిపోయాయి. ఈ సంఘటనతో గురునాధం,అంకయ్యల కటుంబాలు పూర్తిగా రోడ్డున పడే పరిస్థితి చోటు చేసుకుంది.

* కర్నూలు జిల్లా హోళగుంద మండలంలో కర్ణాటక నుండి అక్రమంగా నాటు సారాయి బెల్లం తరలిస్తుండగా మార్గమధ్యంలో పట్టుబడ్డారు సుమారు 15 కింటాలు బెల్లాన్ని నెరణికి తండా కి తరలిస్తుండగా కృష్ణా నాయక్ మార్గమధ్యంలో దొరికిపోయాడు హోళగుంద ఎస్ ఐ విజయ్ కుమార్ తో పాటు సిబ్బంది 1 బుల్లోరా 1 బైకు నలుగురిపై కేసు నమోదు చేశారు హొలగుండ ఎస్ ఐ విజయ్ కుమార్ మీడియాకు తెలియజేశారు