Health

వయోవృద్ధుల పట్ల ఈ కరోనా జాగ్రత్తలు తప్పనిసరి

వయోవృద్ధుల పట్ల ఈ కరోనా జాగ్రత్తలు తప్పనిసరి

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుండి వృద్ధులకు ముఖ్య సూచనలు

కోవిడ్-19 వైరస్ వృద్ధులపై ఎక్కువ ప్రభావం చూపిస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఇదివరకే ప్రకటించింది. వీరిలో వైరస్ బారినపడే అవకాశం ఎక్కువగా ఉండడం, రోగ నిరోధకశక్తి తగ్గిపోవడం వల్ల మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. కోవిడ్-19 పాజిటివ్ పేషెంట్లలో 60ఏళ్లకు పైబడిన వారి మరణాల రేటును తగ్గించేందుకూ పలు సూచనలు చేసింది.

• వృద్ధులలో రోగనిరోధక శక్తి మరియు శరీర పటుత్వము తక్కువగా ఉంటుంది.

• అలాగే బహుళ అనుబంధ వ్యాధుల వల్ల కోవిడ్-19 వచ్చే అవకాశం ఎక్కువ ఉంది.

• వృద్ధులు ఇంట్లోనే ఉండాలి, సందర్శకులను కలవకుండా ఉండాలి. ఒకవేళ కలవాల్సి వస్తే కనీసం ఒక మీటరు దూరం పాటించాలి.

• సబ్బు మరియు నీటితో క్రమం తప్పకుండా చేతులు, ముఖం కడగడం, దగ్గేటప్పుడు-తుమ్మేటప్పుడు మోచేయిని అడ్డుపెట్టడం, టిష్యూ పేపర్ వాడి పారవేయడం లేదా రుమాలును ఉపయోగించి తరువాత శుభ్ర పరచడం లాంటివి అలవర్చుకోవాలి.

• తాజాగా ఇంట్లో వండిన వేడి భోజనం తీసుకుంటూ, ఒంట్లో తరచూ హైడ్రేటింగ్ మరియు రోగనిరోధక శక్తిని పెంచడానికి తాజా పళ్లరసాలు తీసుకోవాలి.

• వృద్ధులు కంటి శుక్లం, మోకాలి మార్పిడి వంటి శస్త్ర చికిత్సలను వాయిదా వేసుకోవాలి ఆరోగ్య సంరక్షణకు ఎప్పటికప్పుడు వైద్యులను ఫోన్ లో సంప్రదించి తదనుగుణంగా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి

• పార్కులు, మార్కెట్లు, మత ప్రదేశాలు వంటి రద్దీ ప్రాంతాలకు వెళ్లకూడదు

* పాజిటివ్ పేషెంట్లలో 60ఏళ్లకు పైబడిన వారి మరణాల రేటును తగ్గించేందుకు దిగువ ప్రతిపాదించిన చర్యలను తీసుకోవాల్సిందిగా సూచించడం జరుగుతోంది.*

• 60 సంవత్సరాల పై బడిన వారికి వెంటనే ట్రూనాట్ టెస్ట్ ను చేయాలి. ఒకవేళ పాజిటివ్ అని వస్తే వెంటనే ఈ కింది ప్రొటోకాల్ పాటించాలి.

• ట్రునాట్ పరీక్ష ద్వారా పాజిటివ్ వచ్చిన వ్యక్తులను ఊహాజనిత సానుకూల కేసులుగా పరిగణించబడతాయి. ఈ కేసులనన్నింటినీ దగ్గరలో ఉన్న కోవిడ్ హాస్పటల్ కు తరలించి ఎరితో కలిసేందుకు ఎలాంటి అవకాశం లేకుండా చర్యలు RT-PCR టెస్ట్ తో ధృవీకరించేందుకు చర్యలు తీసుకోబడతాయి. ఇలాంటి కేసులన్నింటిని మరుసటి రోజు RT-PCR టెస్ట్ చేయాలి.

• ట్రూనాట్ పాజిటివ్ (ప్రిపెక్టివ్ పాజిటివ్) పరీక్షల ద్వారా కోవిడ్ ఆస్పత్రులలో చేరిన వారందరికీ ఆర్డర్ నెం. 29లో ఇచ్చిన ప్రొటోకాల్స్ ప్రకారం చికిత్స అందించాలి.

• ఇంకా క్వారంటైన్ కేంద్రాల్లో అన్ని అనుమానిత కేసులలో (SARI, ILI సింప్టోమాటిక్, కోవిడ్ పాజిటివ్ కేసుల యొక్క ప్రైమరీ మరియు సెంకండరీ కాంటాక్ట్) లో 60 ఏళ్లు పైబడిన వారిందర్నీ వేరుగా ఉంచి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

• నమూనా పరీక్ష కోసం కింది ప్రాధాన్యతలను పాటించాలి.

a. అన్ని ట్రునాట్ పాజిటివ్ కేసులు
b. అన్ని 3rd నమూనా కేసులు ( 15 వ రోజున ఇంటికి పంపించాలి.)
c. అన్ని 2nd నమూనా కేసులు ( 14 వ రోజు )
d. రోగలక్షణాల అనుమానిత కేసులు
• అన్ని క్వారంటైన్ కేంద్రాలలో వైరస్ ఒకరి నుంచి మరొకరికి సంక్రమించకుండా 60ఏళ్లకు పైబడిన వారందరిని విడిగా ఐసోలేషన్ లో ఉంచాలి.