DailyDose

ఏపీలో 10వేలు దాటిన కరోనా కేసులు-TNI బులెటిన్

ఏపీలో 10వేలు దాటిన కరోనా కేసులు-TNI బులెటిన్

* పశ్చిమగోదావరిజిల్లా ఏలూరు పెడవేగి మండలం పినకడిమి గ్రామం. జంగాలపేటలో కరోనా విజృంభిస్తుంది.గురువారం ఈగ్రామాన్ని అధికారులు రెడ్ జోన్ గా ప్రకటించారు గ్రామ ప్రధాన రహదారులలో మూడు చోట్ల రెడ్ జోన్ బోర్డులు పెట్టి రాక పోకలను నిలిపి వేశారు ఈ గ్రామంలో గత కొద్దిరోజుల క్రితం 8 పాజిటివ్ కేసులు నమోదు కాగా మంగళవారం.1 తాజాగా గురువారం మరొక కరోనాకేసు నమోదయింది.దీనితో పినకడిమిలాంటి చిన్న గ్రామంలోనే ఏకంగా10 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జిల్లా అధికారులుకలవరపడుతున్నారు. ఈ గ్రామంనుండి సుమారు 1000 మంది జీవనోపాదికై ఇతర రాష్ట్రాలకు జాతకాలు చెప్పడానికి వెళుతుంటారు.ఎప్రియల్ నెలలో బొంబాయి నుండి 45 మంది పినకడిమి వస్తున్నారని వచ్చిన సమాచారంతో అధికారులు వారిని గ్రామంలోకి రానీయకుండా కొంత మందికి తాడేపల్లి గూడెం.మరి కొంతమందిని ఏలూరు ఆశ్రమం ఆసుపత్రులలో ఏర్పాటు చేసిన క్వారన్ టైన్ లకు తరలించారు 45 మందికి పరీక్షలు నిర్వహించగా వారిలో తొలుత 8 మందికి గత మంగళవారం ఒకరికి 18వతేదీ గురువారం ఇంకొకరికి పాజిటివ్ అని తేలిందని గ్రామకార్యదర్శి జితేంద్ర పెదవేగి ఎస్ ఐ వెంకట నాగరాజుతెలిపారు గురువారం గ్రామంలో పర్యటించి పరిస్థితులను సమీక్షించి బయటి వ్యక్తులు గ్రామంలోకి గ్రామంలోనివారు బయటకు వెళ్లకుండా రహదారుల దిగ్భందనం చేయించారు.

* ఏపిలో పదివేలు దాటిన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య . మొత్తం 10,331 కేసులు నమోదు.

* నూజివీడు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి విజయవాడకు చెందిన కరోనా పాజిటివ్ ముద్దాయి పరా రవడంతో కేసు నమోదు చేసి టవర్ లొకేషన్ ఆధారంగా విజయవాడ కృష్ణ లంక కు చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని కృష్ణలంక పోలీసులకు అప్పజెప్పిన నూజివీడు పట్టణ పోలీసులు.

* కోవిడ్-19కు ఆయుర్వేద మందును కనిపెట్టినట్లు ప్రముఖ దేశీయ కంపెనీ పతంజలి ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ మందుకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. కోవిడ్-19ను నయం చేసే మందుగా పతంజలి చెప్పుకొస్తున్న ఈ మందుకు సంబంధించి ఎలాంటి ప్రకటనలు జారీ చేయొద్దని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ సదరు సంస్థను ఆదేశించింది. ఈ మందుపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఆయుష్ మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. 1954, డ్రగ్స్ నియంత్రణ చట్టం ప్రకారం పతంజలి ఈ మందుకు సంబంధించి ప్రకటనలు జారీ చేయడం అభ్యంతరకరమని ఆయుష్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ మందుకు సంబంధించిన అన్ని వివరాలను.. ఎక్కడ పరిశోధనాత్మక అధ్యయనం చేశారో, ఈ మందు వేటితో తయారైందో, శాంపిల్ పరిమాణంతో సహా అన్ని వివరాలను వెల్లడించాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ పతంజలి సంస్థకు ఆదేశాలు జారీ చేసింది.

* బుల్లితెరలో కరోనా కలకలం చెలరేగింది. ఓ ఛానెల్‌లోని సీరియల్‌లో నటిస్తున్న వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలడం.. ఆయన గత అయిదు రోజుల్లో మూడు వేర్వేరు షూటింగుల్లో పాల్గొనడం ఆందోళన కలిగిస్తోంది. అతను సోమవారం అనారోగ్యంగా ఉండటంతో కరోనా పరీక్షలు నిర్వహించగా.. మంగళవారం పాజిటివ్‌గా తేలింది. దీనిపై దృష్టి సారించినట్లు టీవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి విజయ్‌ యాదవ్‌ తెలిపారు. షూటింగ్‌ల్లో అతనితో కలిసి పనిచేసిన నిపుణులకు, నటులకు, కార్మికులకు కరోనా పరీక్షలు చేయిస్తామన్నారు.

* కేజీహెచ్‌లో కరోనా ఘంటికలు మోగుతున్నాయి. న్యూరోసర్జరీ విభాగానికి చెందిన ఇద్దరు పీజీలు తాజాగా వైరస్‌ బారిన పడ్డారు. అయిదు రోజుల వ్యవధిలో పది మంది పీజీలు, ఒక స్టాఫ్‌ నర్సుకు కరోనా సోకింది. దీంతో ఆసుపత్రి వర్గాల్లో, వైద్య విద్యార్థుల్లో కలకలం రేగుతోంది. న్యూరో సర్జరీ విభాగంలో కరోనా కేసులు వెలుగు చూడడంతో పీజీలతో కలిసి పని చేసిన న్యూరోసర్జరీ విభాగాధిపతి, విమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.సత్యవరప్రసాద్‌ సహా ఆరుగురు వైద్యులు, మరో నలుగురు జూనియర్‌ వైద్యులు, 16 మంది స్టాఫ్‌ నర్సులు క్వారంటైన్‌లోకి వెళ్లారని ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్‌ జి.అర్జున తెలిపారు.