Movies

మళ్లీ మళయాళంలో మెరిసింది

మళ్లీ మళయాళంలో మెరిసింది

అనగనగా ఓ అమ్మాయి… పేరు సుజాత! మాటలు రావు!! ఆ మూగ మనసు ఓ సూఫీ కళాకారుడితో ప్రేమలో పడుతుంది. పెద్దలు వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తారు. తన భార్య మరొకరితో ప్రేమలో ఉందని తెలిశాక, కుటుంబాన్ని ఒక్కటిగా ఉంచడం కోసం భర్త ఎటువంటి ప్రయత్నాలు చేశాడనే కథతో రూపొందిన మలయాళ చిత్రం ‘సూఫియుమ్‌ సుజాతయుమ్‌’. జూలై 3న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానుంది. థియేటర్లలో విడుదల కోసమే ఈ చిత్రం తీశారు. అయితే, కరోనా కారణంగా థియేటర్లు మూతపడటంతో ఓటీటీకి మొగ్గు చూపారు. బుధవారం ట్రైలర్‌ విడుదల చేశారు. మాటలు రాని అమ్మాయి సుజాతగా అదితీ రావ్‌ హైదరీ నటించారు. ప్రచార చిత్రాలు చూస్తే… లవ్‌ జిహాదీని స్పృశించినట్టు అర్థమవుతోంది. ‘‘అందమైన సంగీతభరిత ప్రేమకథా చిత్రమిది. పక్షపాతాలు, వివక్ష లేని అమాయకపు ప్రేమను చూపించిన చిత్రం. నాకెంతో స్పెషల్‌ ఫిల్మ్‌. ప్రేక్షకుల స్పందన కోసం ఎదురు చూస్తున్నా’’ అని అదితీ రావ్‌ హైదరీ అన్నారు. మముట్టి ‘ప్రజాపతి’లో ఆమె చిన్న పాత్ర చేశారు. వెండితెరపై ఆమెకు అదే తొలి చిత్రం. మళ్లీ 14 ఏళ్ల తర్వాత అదితీ రావ్‌ హైదరీ నటించిన మలయాళ చిత్రమిది.