DailyDose

పన్ను దాఖలు గడువు పెంపు-వాణిజ్యం

Business News Roundup - IT Returns Deadline Extended In India

* పాన్‌కార్డుతో ఆధార్‌ను అనుసంధానం చేసుకునే గడువును సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ (సీబీడీటీ) మరోమారు పొడిగించింది.వచ్చే ఏడాది మార్చి 31 వరకు గడువును పెంచుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.గత మార్చి 31తో ముగిసిన గడువును జూన్‌ 30కి పొడిగించింది.దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 32.17 కోట్ల పాన్‌ కార్డులకు ఆధార్‌ నంబర్లు లింక్‌ అయ్యాయి.గతంలో పేర్కొన్న విధంగా జూలై 1 నుంచి ఆర్థిక లావాదేవీలు చేయాలంటే పాన్‌ కార్డుకు ఆధార్‌ నంబర్‌ తప్పనిసరిగా లింకై ఉండాలని సీబీడీటీ పేర్కొంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 272బీ ప్రకారం పాన్‌, ఆధార్‌ నంబర్లను అనుసంధానం చేయకపోతే రూ.10 వేలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.ఒకవేళ కార్డులను లింక్‌ చేయనట్లయితే పాన్‌ కార్డు రద్దవుతుంది. ఆధార్‌ నంబర్‌ను లింక్‌ చేస్తేనే తిరిగి అది పనిచేస్తుంది.ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్‌ 139ఏఏలోని సబ్‌సెక్షన్‌ 2 ప్రకారం ఆధార్‌, పాన్‌ కార్డును తప్పనిసరిగా అనుసంధానం చేయాల్సి ఉంటుంది.కాగా, ఆధార్‌, పాన్‌ లింక్‌ గడువును సీబీడీటీ పొడిగించడం ఇది తొమ్మిదోసారి.

* ఏపీఎస్‌ఆర్టీసీలో ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి అధికారులు షాక్కాంట్రాక్ట్‌ ముగిసిందని.. నేటి నుంచి విధులకు రావొద్దంటూ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఏపీఎస్‌ఆర్టీసీ ఆఫీసు నుంచి ఫోన్లుఉద్యోగులను తొలగించబోమని గతంలో చెప్పిన మంత్రి పేర్ని నాని మంత్రి మాటకు విలువ లేకుండా పోయిందని వాపోతున్న ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిఈ నిర్ణయంతో ఆందోళనలో 7800 మంది ఔటర్‌సోర్సింగ్ సిబ్బంది.

* దేశంలో ప్రతి ఏటా మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది.పన్ను ఆదా పెట్టుబడులు సహా, ఆదాయపన్ను రిటర్ను (ఐటీఆర్​) ఆలస్యంగా దాఖలు చేసేందుకు ఇదే చివరి తేది.అయితే ఈ ఏడాది కరోనా నేపథ్యంలో విధించిన లాక్​డౌన్​తో ఈ గడువును తొలుత జూన్​ 30 వరకు పొడిగించింది కేంద్రం.ఇందుకు మరో ఐదు రోజులే ఉన్న నేపథ్యంలో మరోమారు గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

* చర్మ సంరక్షణకు ఉపయోగించే ప్రముఖ సౌందర్యోత్పత్తి క్రీమ్‌ ‘ఫెయిర్‌ అండ్‌ లవ్లీ’ పేరు మారనుంది. చర్మం రంగుకు సంబంధించి అవాంఛిత భావనలకు ప్రచారం కల్పించకుండా ఉండేందుకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు తయారీ సంస్థ యునీలీవర్‌ ప్రకటించింది. కొత్త పేరును ఎంపిక చేశామనీ, అయితే అనుమతుల కోసం వేచి చూస్తున్నామనీ సంస్థ తెలిపింది.

* ఇండియా ఇన్ఫోలైన్‌ ఫైనాన్స్ సంస్థ షేర్లు గురువారం భారీగా ర్యాలీ చేశాయి. ఒక దశలో ఇవి 10శాతానికి చేరడంతో అప్పర్‌ సర్క్యూట్‌ విధించారు. అప్పటికి ఇది రూ.82.20 వద్ద ఉంది. కంపెనీ ప్రమోటర్‌ నిర్మల్‌ జైన్‌ ఓపెన్‌ మార్కెట్లో షేర్లు కొనుగోలు చేసి కంపెనీలో వాటా పెంచుకొన్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో షేరు భారీగా ర్యాలీ చేసింది.