Fashion

ప్రతిరోజు గొడవలేనా?

ప్రతిరోజు గొడవలేనా?

ఏ రిలేషన్‌లో అయినా సరే చిన్న చిన్న గొడవలు కామన్. ఆ మాత్రానికే విడిపోవడం.. దూరంగా ఉండడం సరికాదు.. ప్రతీ విషయంలోనూ సర్దుకుపోవడం అనేది చాలా అవసరం. అది కూడా ఒక్కరిలో కాదు.. ఇద్దరికి కూడా ఆ రిలేషన్ పట్ల గౌరవం, ప్రేమ, ఇష్టం ఉండాలి. అప్పుడే కలిసుండడం అనేది ఉంటుంది.. కొన్నిసార్లు భరించలేనంత భారంగా అనిపిస్తుంది. అలాంటి సందర్భాల్లో కొన్ని చిట్కాలు పాటించాలని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
*​ఈ నియమం తప్పనిసరి..
ఏదైనా రిలేషన్ షిప్‌లో ఉన్నప్పుడు అది మొత్తం ఆనందంగానే, సంతోషంగానే సాగిపోదు. అందులోనూ కొన్ని ఇబ్బందులు, పొరపాట్లు జరుగుతుంటాయి. ఇలాంటి వాటికే విసిగి చెంది.. మనకు సరిపడని పార్టనర్ దొరికారు అని అడుకోవడం సరికాదని చెబుతున్నారు నిపుణులు. ఓ నిజం చెప్పాలంటే మనం ఆలోచించినట్లుగానే ఎదుటివారు 100 శాతం ఆలచిస్తారనుకోవడం మన పొరపాటే.. అలాంటి వారు దొరకాలంటే చాలా కష్టం.. మన జీవితంలోకి వచ్చినవారిని అలా మార్చుకోవాలని అని చెబుతున్నారు నిపుణులు.
*​పంతం వద్దు..
చాలా మంది.. తమ బంధంలో నా మాట వినడం లేదని పార్టనర్‌పై కంప్లైంట్ చేస్తుంటారు. కానీ, ఒక్కసారి వారి స్థానంలో ఉండి కూడా ఆలోచించాలని చెబుతున్నారు. అప్పుడు వారి ఆలోచన విధానం ఏంటో అర్థం అవుతుంది. ఇలా ఇద్దరు అనుకుంటే ఇద్దరి మధ్య ఇలాంటి పంతాలకు తావే ఉండదు.. నా మాట వినలేదు అన్న భావన అస్సలు ఉండదు.
*అసంతృప్తి..
భార్య భర్తలు, ప్రేమికులు ఇలా ఎవరైనా సరే.. ఏ విషయంలో కూడా పూర్తిగా సంతృప్తిగా ఉండరు. ప్రతీ ఒక్క విషయంలోనూ అసంతృప్తిగా ఉంటారు. అలా ఎప్పుడు కూడా ఉండకూడదని చెబుతున్నారు నిపుణులు. మనకు ఏదైనా వచ్చిందంటే దాని గురించి పాజిటీవ్‌గా ఆలోచించాలి. అంతే కానీ, అందులో లోటు పాట్లు వెతక్కూడదు. కొంతమందికి అలాంటి విషయాలు కూడా ఉండవని గుర్తుపెట్టుకోవాలి. వారిని చూస్తే చాలు.. మన దగ్గర ఉన్న వాటిపై మనకి గౌరవం పెరుగుతుంద. అవి వస్తువులు అయినా పర్లేదు, మనుషులు, వారి మనసులు అయినా పర్లేదు.
*​సర్దుకుపోవడం..
ఏదైనా విషయంలో సర్దుబాటు అనేది ముఖ్యమైన అంశం. దీని వల్ల ఎలాంటి విషయాలు అంతగా బాధపెట్టవు. కాబట్టి ఆలుమగలు, అలుమగలు అయ్యేందుకు ఎదురుచూసేవారు.. అదే ప్రేమికులు.. బంధం విషయంలో సర్దుకుపోవడం చేస్తుండాలి. దీనివల్ల ఎక్కువగా ఎలాంటి సమస్యలు రావని చెబుతున్నారు నిపుణులు.
*​అర్ధం చేసుకోవడం..
ఇక చివరగా అర్ధం చేసుకోవడం కూడా చాలా ముఖ్యమైన అంశం. బంధం విషయంలో అర్థం చేసుకోవడమనేది కీ రోల్ పోషిస్తుంది. ఎదుటివారిని ఎంతబాగా అర్థం చేసుకుంటే అంత బాగా మీరు సమస్యల నుంచి దూరం అవుతారు. ఎలాంటి సమస్యలు ఎదురుకావు. కాబట్టి ఆ విషయాన్ని ఇరువురు అర్థం చేసుకోవాలి. అప్పుడు చాలా వరకూ సమస్యలు దూరం అవుతాయి. ఏ రిలేషన్ షిప్ అయినా సరే అర్థం చేసుకుంటేనే అందంగా ఉంటుంది. ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి