Food

ఈ టిఫిన్…బరువు తగ్గిస్తుంది

This breakfast will help you loose weight || TNILIVE Food

ఈ బ్రేక్‌ఫాస్ట్ చేస్తే బరువు తగ్గడమే కాదు..గుండె సమస్యలు కూడా రావట..

బ్రేక్‌ఫాస్ట్.. క్రమం తప్పకుండా రోజూ తినడం వల్ల బరువు పెరుగుతారని వస్తున్న వార్తల్లో నిజం ఎంతో తెలుసుకోండి..

మనం ప్రతి రోజూ రాత్రి భోజనం చేస్తాం.. ఆ తర్వాత చాలా గంటలు దాదాపు 10 గంటలు దాటిన తర్వాతే బ్రేక్‌ఫాస్ట్ చేస్తుంటాం.. ఈ అల్పాహారం కేవలం ఆకలి మాత్రమే తీరుస్తుందా అంటే.. ఏ మాత్రం కాదని చెబుతున్నారు నిపుణులు.. దీని ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. ఓ రకంగా ఆలోచించాలంటే ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది బ్రేక్‌ఫాస్ట్‌ని స్కిప్ చేస్తుంటారు. కానీ అలా ఎప్పుడు చేయకూడదని చెబుతున్నారు నిపుణులు.

​గుండెకి మంచిది..

రోజూ మనం తీసుకునే ఆహారంలో కీ రోల్ పోషించేది బ్రేక్‌ఫాస్టే. రోజుని ఉల్లాసంగా, ఉత్సాహంగా ప్రారంభించాలంటే ఉదయాన్నే మంచి పోషకమైన బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి. లేకపోతే మనం చేసే పనిపై శ్రద్ధ పెట్టలేం. ఏ పని మీదైనా పూర్తిగా శ్రద్ధ పెడతాం.. అదే బ్రేక్ ఫాస్ట్ చేయకుండా ఉంటే ఆకలి వేసి చేసి పనిపై కూడా దృష్టి పెట్టమని చెబుతున్నారు నిపుణులు. మంచి బ్రేక్ ఫాస్ట్ అంటే పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే, కొవ్వు శాతం తక్కువగా ఉండే బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటే గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

​శరీర బరువు అదుపులో..

అదే విధంగా, ప్రతి రోజూ బ్రేక్ ఫాస్ట్ చేయడం వల్ల కలిగే మరో ముఖ్య లాభం ఏంటంటే.. శరీర బరువు అదుపులో ఉంటుంది.. ఎందుకంటే.. ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం వల్ల ఏ ఫుడ్‌మీదకి మనసు మళ్లదు.. వేరే ఫుడ్ తినం.. దీంతో పాటు.. ఉదయమే బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే మధ్యాహ్నానికి ఆకలి పెరిగి ఎక్కువగా భోజనం చేస్తాం.. దీంతో బరువు ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు. బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే మన బాడలో చెడు కొలెస్ట్రాల్ పెరిగి బరువు పెరిగేందుకు అవకాశం ఉంటుంది..

​మతిమరుపు సమస్యలు దూరం..

దీంతో పాటు.. మెదడు చురుగ్గా పనిచేసేందుకు కూడా బ్రేక్ ఫాస్ట్ హెల్ప్ చేస్తుంది.. మనం తీసుకునే ఆహారం వల్లే మెదడుకి గ్లూకోజ్ అందుతుంది.. అప్పుడే మనం ఏ పనైనా సరిగ్గా చేయగలం.. మనం బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే మెదడు చురుగ్గా పనిచేయదు. చేసే పని పట్ల ఆసక్తి తగ్గుతుంది. మతిమరుపు వంటి సమస్యలు కూడా రావు.

​షుగర్ పేషెంట్స్‌కి మంచిది..

అంతేనా.. బ్రేక్ ఫాస్ట్ వల్ల కలిగే లాభాలు ఇంకా ఉన్నాయి.. బ్రేక్ ఫాస్ట్ సరిగ్గా చేస్తే షుగర్ వ్యాధి రాదని చెబుతున్నారు నిపుణులు. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ పెరగడం వంటి సమస్యలు దూరం అవుతాయని చెబుతున్నారు. షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయని చెబుతున్నారు.

​నెలసరి సమస్యలు దూరం..

కొంతమంది మహిళలకు పీరియడ్స్ రెగ్యులర్‌గా రావు. అలాంటి వారు పోషకాహారం తీసుకోవడంతో పాటు బ్రేక్‌ఫాస్ట్ రెగ్యులర్‌గా చేయాలని చెబుతున్నారు. దీని వల్లే నెలసరి సమస్యలు దూరం అవుతాయని చెబుతున్నారు. అయితే, బ్రేక్ ఫాస్ట్ చేయాలి. అందులో పోషకాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఆయిలీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ కాకుండా ఆవిరి మీద ఉడికించిన ఇడ్లీలు, గుడ్లు, మొలకలు వంటివి తినాలి. సో, ఇన్ని లాభాలు ఉన్న బ్రేక్‌ఫాస్ట్‌ని అస్సలు స్కిప్ చేయొద్దు.