DailyDose

కోవిద్ మందు తెలంగాణాకు వచ్చేసింది-TNI బులెటిన్

TNILIVE Corona Bulletin || COVID19 Medicine Reaches Telangana

* కొవిడ్‌-19 చికిత్సలో వినియోగించనున్న ఔషధం ‘కొవిఫర్‌’ను తొలివిడతగా ఐదు రాష్ట్రాలకు అందచేశారు. వీటిలో అత్యధిక కరోనా వైరస్‌ కేసులు నమోదవుతున్న మహారాష్ట్ర, దిల్లీతో సహా గుజరాత్‌, తమిళనాడు, తెలంగాణా ఉన్నాయి. అమెరికాకు చెందిన గిలిద్‌ సైన్సెస్‌ అభివృద్ధి చేసిన ‘రెమ్‌డెసివర్‌’కు జనరిక్‌ తయారుచేసి, పంపిణీ చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన హెటిరో ల్యాబ్స్‌కు అనుమతి లభించిన సంగతి తెలిసిందే. హెటిరో తొలివిడతగా 20,000 వయల్స్‌ను ఆయా రాష్ట్రాలకు అందచేసింది. మరో రెండు-మూడు వారాల్లో లక్ష వయల్స్‌ తయారు చేయాలని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. కాగా, రెండో విడత ఔషధాన్ని కోల్‌కతా, ఇండోర్‌, భోపాల్‌, లఖ్‌నవూ, పట్నా, భువనేశ్వర్‌, రాంచి, విజయవాడ, కోచి, తిరువనంతపురం, గోవా నగరాలకు పంపిణీ చేయనుంది.

* ఏపీ హైకోర్టులో కరోనా కలకలం. ఆదివారం వరకూ కోర్ట్ కార్యకలాపాలు నిలిపివేత. సిబ్బంది విధులకు హాజరుకావొద్దని ఆదేశాలు.

* ఏపి హెల్త్ బులిటెన్ విడుదల.గడిచిన 24 గంటల్లో కొత్తగా 553 కరోనా పాజిటివ్ కేసులు..కరోనా పాజిటివ్ తో కొత్తగా 7 మృతి.కృష్ణా జిల్లా లో 2, కర్నూల్ జిల్లా లో 2, గుంటూరు 2, తూర్పు గోదావరి ఒక్కరు మృతి.రాష్ట్రానికి సంబంధించిన కరోనా పాజిటివ్ కేసులు 477.ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 66 మందికి కరోనా నిర్ధరణ.దీంతో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 10884.గడిచిన 24 గంటల్లో మొత్తం 19085 శాంపిల్స్‌ పరీక్ష.ఇప్పటివరకు కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 136.

* భారత్‌లో కరోనా కేసులు రోజురోజుకు మరింత పెరిగిపోతున్నాయి. ఈరోజు కూడా దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారం ఉదయం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌ ప్రకారం గడిచిన 24 గంటల్లో కొత్తగా 16,922 కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగుచూడగా.. 418 మంది మృత్యువాత పడ్డారు. దేశంలో ఒక్కరోజులోనే దాదాపు 17వేలకు చేరువలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. తాజాగా వచ్చిన కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకు 4,73,105 కేసులు నమోదు కాగా, మరణాల సంఖ్య 14,894గా ఉంది. కరోనా వైరస్‌ నుంచి 2,71,696 మంది పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 1,86,514 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

* భారత్‌లో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకీ రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 4.73లక్షల కేసులు నమోదు కాగా.. 14,894మంది మృత్యువాతపడ్డారు. దేశంలో నమోదవుతున్న మరణాల్లో 80శాతం ఐదు రాష్ట్రాల్లోనే నమోదు కావడం గమనార్హం. వీటిలో మహారాష్ట్ర, దిల్లీ, గుజరాత్‌, తమిళనాడు, ఉత్తర్‌ ప్రదేశ్‌ ఉన్నాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 6739మంది మరణించగా.. దిల్లీలో 2365; గుజరాత్‌లో 1735; తమిళనాడులో 866, ఉత్తర్‌ప్రదేశ్‌లో 596 చొప్పున మరణాలు నమోదయ్యాయి.