Movies

సోదర సోదరీమణులు

సోదర సోదరీమణులు

అగ్ర కథానాయకుడు చిరంజీవి సోదరి పాత్రలో అలనాటి తార సుహాసిని నటించబోతున్నారా?.. అవుననే అంటున్నాయి ఫిల్మ్‌ వర్గాలు. మలయాళంలో హిట్‌ అందుకున్న ‘లూసిఫర్‌’ను తెలుగులో రీమేక్‌ చేయబోతున్న సంగతి తెలిసిందే. సుజీత్‌ దర్శకత్వం వహించబోతున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ పతాకంపై రామ్‌ చరణ్‌ నిర్మించబోతున్నారు. కాగా, ఈ సినిమాలోని కీలక పాత్ర కోసం దర్శక, నిర్మాతలు సుహాసినిని సంప్రదించినట్లు సమాచారం.

మాతృకలో మంజూ వారియర్‌ పోషించిన పాత్రలో ఆమె నటించబోతున్నట్లు తెలుస్తోంది. సుహాసినికి కూడా పాత్ర నచ్చడంతో గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆగస్టు తర్వాత దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుందట. తొలుత ఈ పాత్రకు విజయశాంతిని అనుకున్నట్లు వార్తలు వచ్చాయి.