NRI-NRT

ఆస్ట్రేలియాలో పీవీ విగ్రహం పెడతామన్న ఎన్నారై తెరాస

NRI TRS Australia Celebrates PV Birthday

దక్షిణాది తొలి ప్రధాని, విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలకు ఆధ్యుడు, బహుబాషా కోవిదుడు, తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలు ఆస్ట్రేలియాలో ఘనంగా జరిగాయి. టీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో విదేశీ గడ్డపై మొదటి ఉత్సవాలను ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌, సిడ్ని, కాన్బెర్రా, ఆడిలైడ్‌, బ్రిస్బేన్‌లలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్‌రెడ్డి మాట్లాడుతూ… పీవీ నరసింహారావు శత జయంతిని 50 దేశాల్లో ఘనంగా నిర్వహించతలపెట్టిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు అన్నారు. ఆస్ట్రేలియాలో పీవీ విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.