Politics

మా కులానికి జగన్ అన్యాయం చేశారు

Pawan Kalyan Says Jagan Cheated Kapus

కాపులకు జగన్‌రెడ్డి ప్రభుత్వం అన్యాయం చేసిందని జనసేన అధినేత పవన్‌‌కల్యాణ్‌ ధ్వజమెత్తారు. బ్రిటిష్‌ కాలంలో బీసీలుగా ఉన్న కాపులను.. ఓసీలుగా మార్చి, తర్వాత రాజకీయ లబ్ధికి వాడుకున్నారని విమర్శించారు. 56 ఏళ్లుగా కాపులపై కపట ప్రేమను నటిస్తూ ఓట్లు దండుకుంటున్నారని దుయ్యబట్టారు. కాపులు ఆర్థికంగా బలపడటం ఇష్టంలేక రిజర్వేషన్లు అడ్డుకున్నారని మండిపడ్డారు. జగన్‌రెడ్డి పగ్గాలు చేపట్టాక కాపులకు ఇచ్చిన.. 5శాతం రిజర్వేషన్లను తుంగలో తొక్కారని, కాపులకు రిజర్వేషన్ హక్కు పునరుద్ధరించాలని పవన్‌ డిమాండ్ చేశారు.