NRI-NRT

ప్రవాసులను అలరించిన ఆర్పీ సంగీత విభావరి

ప్రవాసులను అలరించిన ఆర్పీ సంగీత విభావరి-For Charity To SiliconAndhra Hospital-RP Patnaik Internet Music Show For SiliconAndhra Sanjeevani Hospital

సిలికానాంధ్ర సంజీవని ఆసుపత్రి అభివృద్ధికి నిధుల సేకరణ నిమిత్తం ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయిక్ సంగీత విభావరి కార్యక్రమాన్ని అంతర్జాలంలో నిర్వహించారు. పలు తెలుగు సంఘాలు మద్దతు అందించిన ఈ కార్యక్రమం ప్రవాసులను అలరించింది. గాయనీ గాయకులు సత్యయామిని, సాహితీ సోనీ, అనుదీప్, దేవ్మనీషా ఈరబత్తిని తమ పాటలతో ఆకట్టుకున్నారు. హైదరాబాద్ నుండి ఆర్పీ వీరందరినీ ఆన్‌లైన్‌లో అనుసంధాన్మ్ చేశారు. అశోక్ బడ్డి, శ్రీని తొంట, కిషోర్ కంచర్ల, రాజ్ పొట్లూరి, హరి దేవబత్తుని, చాందిని దువ్వూరి, స్వప్న చిల్లా తదితరులు కార్యక్రమ విజయవంతానికి సహకరించారు.