Health

దేహానికి వేడినీటి స్నానం మంచిది

దేహానికి వేడినీటి స్నానం మంచిది

వర్షాకాలంలో వేడి నీటి స్నానం తప్పక చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. గోరువెచ్చని నీటితో రాత్రిపూట స్నానం చేయడం ద్వారా నిద్రలేమి సమస్య వుండదని వైద్యులు చెప్తున్నారు. వర్షాకాలంలో ప్రతిరోజూ వేడినీటి టబ్‌లో స్నానం చేయడం వల్ల హృద్రోగాలు వచ్చే అవకాశం తక్కువని పరిశోధనల్లోనూ తేలింది. వేడినీటితో టబ్బు స్నానం లేదా వేడినీటి స్నానం చేసేవారికి గుండె సంబంధిత రుగ్మతలుండవు.

వేడినీటి టబ్బు స్నానం చేసే అలవాటు ఉందని గుర్తించారు. ఇలా చేసేవాళ్లకు మిగిలిన వాళ్లతో పోలిస్తే గుండెజబ్బు, గుండెపోటు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉన్నట్లు పరిశోధనలో తేలింది. అంతేకాదు, వేడినీటి టబ్‌ స్నానం హైపర్‌ టెన్షన్‌నీ తగ్గిస్తుంది. 

ప్రతిరోజూ వేడి నీటి స్నానం చేయడం వల్ల మధుమేహం, రక్తపోటు తగ్గడమే కాకుండా బరువును కూడా తగ్గించుకోవచ్చు. వేడి నీటి కారణంగా కేలరీలు ఖర్చు అవుతాయి. వేడి నీటితో స్నానం చేస్తే రోజంతా అలసిన అనుభూతి తగ్గడమే కాకండా ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుందని వైద్యులు చెప్తున్నారు.