Movies

వర్మ…పవర్‌స్టార్

వర్మ…పవర్‌స్టార్

సంచలనాలకు కేరాఫ్‌ అడ్రస్‌ రాంగోపాల్‌వర్మ. లాక్‌డౌన్‌ కారణంగా ఎక్కడి షూటింగ్‌లు అక్కడ ఆగిపోయి, చిత్ర పరిశ్రమ స్తంభించిపోయిన సమయంలోనూ వరుస చిత్రాలు తీస్తూ దూసుకుపోతున్నారు. ‘క్లైమాక్స్‌’ అంటూ పోర్న్‌స్టార్‌తో ఓ సినిమా తీసి ఏటీటీల వేదికగా దాన్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా తన తర్వాతి చిత్రాన్ని కూడా ప్రకటించారు. ‘పవర్‌స్టార్‌’ పేరుతో ఓ సినిమా తీయబోతున్నట్లు ప్రకటించిన ఆయన ఓ వీడియోను పంచుకున్నారు. ‘ఇదిగో ఇతనే నా కొత్త చిత్రం ‘పవర్‌స్టార్‌’లో స్టార్‌. ఇతను నా ఆఫీస్‌కు వచ్చిన సందర్భంలో తీసిన వీడియో ఇది. ఏ వ్యక్తితోనైనా ఇతనికి పోలికలు ఉంటే అది హఠాత్తుగా, అనుకోకుండా, ఉద్దేశపూర్వకంగా, అప్రయత్నంగా జరిగి ఉండవచ్చు’’ అంటూ ట్వీట్ చేశారు.