ScienceAndTech

హైదరాబాద్-విజయవాడ మధ్య హైస్పీడ్ రైలు

High Speed Train Between Hyd-VJA Says KTR

తెలంగాణ పురపాలక, ఐటీ శాఖ మంత్రి కెటిఆర్‌ హుజూర్ నగర్ నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్డీవో కార్యాలయాన్ని ప్రారంభించారు. హుజూర్ నగర్ పురపాలక సంఘం భవన కార్యాలయంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మంత్రులు మొక్కలు నాటారు. పురపాలక సంఘం పరిధిలో నూతనంగా నిర్మించ తలపెట్టిన అర్బన్ పార్క్ నిర్మాణంతో పాటు స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్‌ మాట్లాడుతూ.. హుజూర్ నగర్ లో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేశాం. యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు. హైదరాబాద్ టు విజయవాడకు హై స్పీడ్ రైలు ఏర్పాటు చేసేలా ప్రయత్నం చేస్తామని మంత్రి కెటిఆర్‌ తెలిపారు. పార్టీలకు అతీతంగా తెలంగాణలో అభివృద్ధి జరుగుతున్నదని, ఇప్పుడు ఎన్నికలు ఏమి లేవు. మా ముందున్న లక్ష్యం అభివృద్ధి మాత్రమే అన్నారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ లు, మండలాలు, గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. నేడు సంక్షేమ ఫలాలు ప్రజల ముంగిటకు వచ్చాయని తెలిపారు.