Politics

నిద్రమత్తు వీడని తెలుగు ఎంపీలు

నిద్రమత్తు వీడని తెలుగు ఎంపీలు

2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎంపీల నిధులు దాదాపు 90% జిల్లా అధికారుల వద్ద నిరుపయోగంగా ఉన్నాయి. నియోజకవర్గ అభివృద్ధికి ఒక్కో ఎంపీకి ఏటా రూ.5 కోట్లను 2 విడతల్లో ఇస్తారు. కరోనా కారణంగా 2020-21, 2021-22 సంవత్సరాలకు ఈ పథకాన్ని నిలిపి వేశారు. 17వ లోక్‌సభకు ఎన్నికైన ఎంపీలకు 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నిధుల్ని ఉపయోగించుకోవడానికి మాత్రమే వీలుంది. ఆ ఏడాదికి విడుదలైన తొలి విడత నిధుల్లో ఏపీ ఎంపీల ఖాతాల్లోని 10.97%, తెలంగాణ ఎంపీల ఖాతాల్లోని 10.31% నిధులే ఖర్చయినట్లు ఎంపీ ల్యాడ్స్‌ వెబ్‌సైట్‌ పొందుపరిచిన గణాంకాలు చెబుతున్నాయి. ఏపీ ఎంపీలు తమ ఖాతాల్లోని నిల్వల్లో 95.87% మొత్తానికి, తెలంగాణ ఎంపీలు 74.35% మొత్తానికి పనులు మంజూరు చేసినా అధికారులు 10శాతం చొప్పునే ఖర్చు చేయగలిగారు.