Health

ఏపీలో నూతన వైద్య కళాశాలల వివరాలు

ఏపీలో నూతన వైద్య కళాశాలల వివరాలు

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు కానున్న 16 మెడికల్ కాలేజీలు…

ఈ 16 మెడికల్ కాలేజీల నిర్మాణాలకు 12000 కోట్లు ఖర్చు పెట్టనున్న జగన్ ప్రభుత్వం..

ప్రస్తుతం ఉన్న 11 మెడికల్ కాలేజీల రూపురేఖలు మార్చడం కోసం నిధుల కేటాయింపు..

కొత్తగా మెడికల్ కాలేజీలు రానున్న ఊర్లు ::

1.మచిలీపట్నం.
2.అరకు.
3.నరసరావుపేట.
4 నంద్యాల.
5.పులివెందుల.
6.ఏలూరు.
7.అనకాపల్లి.
8.రాజమండ్రి.
9.హిందూపురం.
10.రాజంపేట.
11.అమలాపురం
12.నర్సాపురం.
13.బాపట్ల.
14.మార్కాపురం.
15.చిత్తూరు.
16.విజయనగరం.

పైన ఉన్న 16 ఊర్ల లిస్టులో మార్కాపురం, పులివెందుల తప్పితే మిగిలిన 14 కూడా పార్లమెంట్ నియోజకవర్గాలే.

ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గం జిల్లా అయితే ఈ 14 పార్లమెంట్ నియోజకవర్గాలు కూడా జిల్లాలు అవుతాయి.

ఇండియన్ మెడికల్ కౌన్సిల్ రూల్స్ ప్రకారం ఏదయినా జిల్లాలో మెడికల్ కాలేజి లేకపోతే ఆ జిల్లాలో కొత్తగా కట్టే మెడికల్ కాలేజీ నిధుల్లో సగం నిధులు కేంద్రమే భరిస్తుంది.

కొత్తగా రానున్న జిల్లాలో మెడికల్ కాలేజీలు తీసుకురావడం వెనుక మన ప్రభుత్వ వ్యూహం కూడా ఇదే..

ఆ లెక్క ప్రకారం ఈ 14 నియోజకవర్గాలు ఖచ్చితంగా కొత్తగా రాబోయే జిల్లాలు అని అర్థం…

రాజంపేటలో కూడా మెడికల్ కాలేజి రాబోతుంది కాబట్టి పులివెందుల జిల్లా అయ్యే అవకాశాలు లేనట్టే.

ఇక మిగిలింది మార్కాపురం… అంటే కొత్తగా రాబోయే జిల్లాలో మార్కాపురంకి జిల్లా అయ్యే అవకాశాలు ఉన్నట్టే.

ఇప్పటికే ఉన్న 13 జిల్లాలకు తోడు ఈ 15 జిల్లాలు వస్తే రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 28 అవుతుంది.