Movies

మహేశ్‌కు రష్మిక బహుమతులు

కరోనా కాలంలో మహేశ్‌బాబు ఇంటికి ఓ గిఫ్ట్‌ హాంపర్‌ వచ్చింది! అదీ కర్ణాటకలోని కూర్గ్‌ నుంచి!! ‘‘నోరూరించే రుచికరమైన ఆవకాయ్‌ పచ్చడి, మామిడికాయలు, వగైరా పంపించినందుకు థ్యాంక్యూ రష్మిక. కూర్గ్‌ నుంచి హైదరాబాద్‌కి ప్రేమతో పంపించావు. కొవిడ్‌ టైమ్‌లో మాకు వచ్చిన ఫస్ట్‌ గిఫ్ట్‌ హాంపర్‌ ఇదే’’ అని మహేశ్‌ సతీమణి నమ్రతా శిరోద్కర్‌ అన్నారు.గిఫ్ట్‌ హాంపర్‌ ఫొటో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ‘‘మీకు అవి నచ్చాయని ఆశిస్తున్నాను’’ అని రష్మికా మందన్న బదులు ఇచ్చారు. మహేశ్‌ సరసన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో ఆమె నటించిన సంగతి తెలిసిందే. కర్ణాటకలోని కూర్గ్‌ రష్మిక స్వస్థలం. ఆమె కుటుంబానికి అక్కడ కాఫీ తోటలు, సాగుభూములు ఉన్నాయి. తమ ఇంట్లో ఆవులు, కోళ్లు, బాతులు ఉన్నాయనీ… తనకు వ్యవసాయం తెలుసుననీ మొన్నామధ్య రష్మిక చెప్పారు. లాక్‌డౌన్‌లో ఇంట్లోనే ఉంటున్నారామె. అక్కణ్ణుంచి ఇలా గిఫ్ట్‌ పంపారన్నమాట!