DailyDose

ఏపీలో నూతనంగా 704 కేసులు-TNI బులెటిన్

ఏపీలో నూతనంగా 704 కొత్త కేసులు-TNI బులెటిన్

* తిరువూరులో కరోనా పాజిటివ్ కారణంగా వృద్ధురాలి మృతి. పట్టణంలో మంగళవారం నుంచి లాక్ డౌన్ ప్రకటించిన అధికారులు. తిరువూరులో కరోనా పాజిటివ్ కేసు వచ్చిన దుకాణదారు వద్ద పనిచేసే రోలుపడికి చెందిన ఏడుగురు వ్యక్తులకు వైద్యారోగ్యశాఖ సిబ్వంది హోం క్వారంటైన్లో ఉండాలని నోటీసులు ఇచ్చారు. వారి నుంచి నమూనాలు సేకరిస్తున్నారు.

* ఏపీ లో 704 కు చేరుకున్న కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య …..ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ కోరలు చాస్తూనే ఉంది. 24 గంటల వ్యవధిలో కొత్తగా 704 కేసులు నమోదు కాగా..అందులో ఏపీకి చెందిన వారు 648 మంది ఉన్నారు.258 మంది కోలుకుని డిశ్చార్జ్ అయినట్టు వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.కోవిడ్‌తో ఏడుగురు చనిపోయారు. అందులో కృష్ణా జిల్లాకు చెందిన వారు ముగ్గురు ఉండగా..కర్నూలుకు చెందిన వారు ఇద్దరు, గుంటూరు, అనంతపురంకు చెందిన వారు ఒక్కొక్కరుగా ఉన్నారు.ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 51 మందికి పాజిటివ్‌గా తేలగా… వివిధ దేశాల నుంచి వచ్చిన వారిలో ఐదుగురికి కరోనా సోకింది.ఇప్పటి వరకు ఏపీలో 8 లక్షల 90వేల 190 మందికి టెస్టులు చేశారు.కోవిడ్‌ కేర్‌ సెంటర్లతో పాటు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారు 7897 మంది ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.కాగా, రాష్ట్రంలో ఇప్పటివరకు 187 కరోనా మరణాలు సంభవించాయి.

* ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి విజృంభ‌ణ ఇప్ప‌ట్లో ముగిసిపోద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ టెడ్రోస్ అధనామ్ గెబ్రియేసస్ స్ప‌ష్టం చేశారు. గ‌త సంవ‌త్స‌రం డిసెంబ‌ర్ నెల‌లో చైనాలో బ‌య‌ట‌పడ్డ ఈ మ‌హ‌మ్మారి, ఆరు నెల‌ల్లోపే ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోటి మందికి సోక‌గా, 5ల‌క్ష‌ల మందిని బ‌లితీసుకుంది. ఈ వైర‌స్ గురించి ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌కు చైనా తెలియ‌జేసి ఆరు నెల‌లు ముగిసిన నేప‌థ్యంలో డ‌బ్ల్యూహెచ్ఓ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ విలేక‌రుల‌తో మాట్లాడారు.

* జీహెచ్‌ఎంసీ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఉచిత కరోనా పరీక్షలు మళ్లీ ప్రారంభమయ్యాయి. సరోజినీదేవి కంటి ఆసుపత్రి, నేచర్‌ క్యూర్‌, ఆయుర్వేదిక్‌ హాస్పిటల్‌, చార్మినార్‌ నిజామియా హాస్పిటల్‌లో ఇవాళ్టి నుంచి కరోనా పరీక్షల కోసం శాంపిల్స్‌ సేకరిస్తున్నారు. ఒక్కో కేంద్రంలో రోజుకు 250 శాంపిల్స్‌ సేకరించాలని లక్ష్యంగా నిర్థేశించారు. రంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్‌ ఏరియా ఆసుపత్రి, వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి, బాలాపూర్‌ యూపీహెచ్‌సీ, మహేశ్వరం సీహెచ్‌సీలలో రోజుకు 150 శాంపిల్స్‌ చొప్పున సేకరించాలని నిర్ణయించారు.

* కొవిడ్‌-19 దెబ్బకు ఇంటి నుంచి పనిచేయటం పెరిగిపోయింది. ఆఫీసులో మాదిరిగా ఇంట్లో సౌకర్యాలు ఉంటాయా? ల్యాప్‌టాప్‌ను ఒళ్లోనో, నేల మీదో పెట్టుకొని ముందుకు ఒరిగిపోయేవారు కొందరు. డెస్క్‌టాప్‌ ఉన్నా సరైన కుర్చీలేక సతమతమయ్యేవారు గంటల తరబడి అలాగే ఉండిపోతే భంగిమ దెబ్బతింటుంది. మెడనొప్పి, వెన్నునొప్పి వంటి సమస్యలకు దారితీస్తుంది. అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. డెస్క్‌ ముందు కూర్చున్నప్పుడు పాదాలు పూర్తిగా నేలకు ఆనించి ఉంచాలి. తొడలు నేలకు సమాంతరంగా.. కుర్చీ చివరి భాగం, మోకాళ్ల మధ్య కాసింత దూరం ఉండేలా చూసుకోవాలి. కంప్యూటర్‌ పైభాగం కంటికి సమానంగా లేదా కాస్త కిందుగా ఉండాలి. మధ్యమధ్యలో లేచి అటూఇటూ నాలుగడుగులు వేయాలి. కాళ్లు, చేతులు, వేళ్లు, నడుమును సాగదీస్తూ కండరాల మీద పడే ఒత్తిడిని తగ్గించుకోవాలి. తేలికైన యోగాసనాలు వేసినా సరే.