DailyDose

పీవీపీ అరెస్టుకు కోర్టు బ్రేకులు-నేరవార్తలు

పీవీపీ అరెస్టుకు కోర్టు బ్రేకులు-నేరవార్తలు

* వీరుళ్ళపాడు మండలంలో ప్రభుత్వం నిషేధిత గుట్కా కైని అమ్ముతున్న వారి పై కొరడా జుళిపించిన పోలీసులుమండలంలోని జయంతి గ్రామం వద్ద ప్రభుత్వ నిషేధం గుట్కాలను అమ్ముతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకోగాఅతని వద్ద 60 వేల రూపాయల విలువైన గుట్కాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై హరిప్రసాద్ తెలిపారు

* ఉత్తర టెహ్రాన్​లోని ఓ ఆసుపత్రిలో ఘోర ప్రమాదం జరిగింది.భారీ పేలుడు సంభవించిన ఘటనలో 19 మంది మరణించారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.గ్యాస్​ లీకేజే ప్రమాదానికి కారణమని అధికారులు అనుమానిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

* అనంతపురం జిల్లా ధర్మవరం లో పెను విషాదం.రాత్రి భార్య ఆత్మహత్య ?ఈ రోజు ఉదయం రైలు కింద పడీ భర్త ఆత్మహత్య.

* కదిరి పట్టణంలోని చలపతినాయని సత్రం వద్ద కూరగాయల వ్యాపారి మహబూబ్ బాషా దారుణ హత్యకు గురయ్యాడు

* తూర్పు గోదావరి జిల్లాలో అక్రమ సముద్ర ఇసుక తవ్వకాలు, అక్రమ రోయ్యల చెరువులపై చెన్నై లోని “గ్రీన్ ట్రిబ్యునల్” (ఎన్ జి టి ) విచారణ.కేంద్ర పర్యావరణ శాఖ, కేంద్ర గనుల శాఖ, రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు నోటీసులు.

* బందర్ రోడ్డులో మూడు 108 వాహనాలు ఒకదానికి ఒకటి డీ…మొత్తం 3 వెహికల్స్ డ్యామేజి.

* వైకాపా నేత పొట్లూరి వరప్రసాద్‌(పీవీపీ)కి స్వల్ప ఊరట లభించింది.పీవీపీ ముందస్తు బెయిల్‌పై తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.తదుపరి ఆదేశాలిచ్చే వరకు పీవీపీని అరెస్టు చేయవద్దని పోలీసులకు నోటీసులు జారీ చేసింది.విల్లా గొడవలో పీవీపీపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.విచారణకు రావాలని పీవీపీకి బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు జారీచేశారు.పోలీసుల విచారణకు హాజరుకాకుండా ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు.తదుపరి ఆదేశాలిచ్చే వరకు పీవీపీని అరెస్టు చేయవద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను జులై 27కు వాయిదా వేసింది.

* తంబళ్లపల్లె నియోజకవర్గం బి.కొత్తకోట మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద కస్​పున్నీసా అనే గ్రామ వాలంటీర్‌ ఆత్మహత్యాయత్నం చేసింది.