DailyDose

ఒక్క నెలలో 4లక్షల కేసులు-TNI బులెటిన్

India Shatters Corona Records - 400K Cases In One Month

* ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారికి డీజీపీ సవాంగ్‌ స్పష్టంసరిహద్దుల్లో థర్మల్‌ స్క్రీనింగ్‌ చేశాకే అనుమతి* రాత్రిపూట అనుమతి లేదని వెల్లడి* పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారిని అనుమతించే విషయంలో ఆంక్షలు కొనసాగుతున్నాయని డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌ స్పష్టం చేశారు.కరోనా నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు, ఆంక్షలు కొనసాగుతున్నాయన్నారు.ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వచ్చే వారు కచ్చితంగా అనుమతి తీసుకోవాల్సిందేనన్నారు.స్పందన ద్వారా దరఖాస్తు చేసుకొని పాస్‌ (అనుమతి) పొందాలని సూచించారు.పాస్‌ ఉన్న వారిని ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే అనుమతిస్తామని తెలిపారు.రాష్ట్ర సరిహద్దులోని పోలీస్‌ చెక్‌పోస్టుల వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసిన తర్వాతే అనుమతిస్తారన్నారు.

* కంటోన్మెంట్ హరిత హారం లో కరోనా కలకలం..రెండు రోజులు క్రితం జరిగిన హరిత హారంలో పాల్గొన్న నేతకు కరోనా పాజిటివ్..ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి తలసానితో పాటు పలువురు నేత‌లు,ఇప్పటికే హోమ్ క్వారంటైన్‌లో బోర్డు మెంబ‌ర్లు

* ఏపీ కరోనా కేసుల తాజా బులెటిన్‌ను వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసింది. గత 24 గంటల్లో మొత్తం 657 కేసులు నమోదయ్యాయి. వీరిలో ఏపీ వాసులు 611 మంది కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 39మంది, విదేశాల నుంచి వచ్చిన వారు ఏడుగురు ఉన్నారు. కరోనా వైరస్ కారణంగా ఆరుగురు చనిపోయారు. కర్నూల్ జిల్లాలో ముగ్గురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు మృతి చెందారు.

* ఇవాళ ఏపిలో 657 కొత్త కరోనా పాజిటివ్ కేసులు, 6 మరణాలు.

* ఒక్క‌‌ నెల‌లో 4ల‌క్ష‌ల కేసులు, 12వేల మ‌ర‌ణాలు!_ 24గంట‌ల్లో 507 మంది మృత్యువాత‌దిల్లీ: దేశంలో క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి విశ్వ‌రూపం చూపిస్తోంది.గ‌త కొన్ని రోజులుగా భార‌త్లో నిత్యం దాదాపు 19వేల పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి.క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య కూడా క‌ల‌వ‌ర‌పెడుతోంది.తాజాగా గ‌డిచిన 24గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా కొత్త‌గా 18,653 పాజిటివ్ కేసులు, 507మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి.దేశంలో క‌రోనా వైర‌స్ బ‌య‌ట‌ప‌డిన నుంచి ఒక్క‌రోజులో ఇంతమంది ప్రాణాలు కోల్పోవ‌డం ఇదే తొలిసారి.దీంతో బుధ‌వారం నాటికి దేశంలో మొత్తం కొవిడ్‌ బాధితుల‌ సంఖ్య 5,85,493కి చేరింది.వీరిలో ఇప్ప‌టివ‌ర‌కు 17,400మంది మృత్యువాత‌ప‌డ్డ‌ట్లు కేంద్ర ఆరోగ్య,‌ కుటుంబ మంత్రిత్వశాఖ వెల్ల‌డించింది.