ScienceAndTech

Huaweiపై ఇండియా నిషేధం?

TNILIVE SciTech News - India To Ban Huawei Products As Well

Huaweiపై త్వరలోనే బ్యాన్ విధించే ఛాన్స్‌లు ఉన్నాయా …?

_ చైనాపై మరో యుద్ధానికి భారత్ సిద్ధం.. ఈసారి అంతకుమించి..!

Huawei.. టెక్ రంగంలో ఈ పేరుకు పెద్ద చరిత్రే ఉంది. చైనాకు చెందిన ఈ టెక్ దిగ్గజం 5జీలో గ్లోబల్ మార్కెట్ లీడర్ అని చెప్పవచ్చు.

గత 20 సంవత్సరాలుగా భారత్‌లో తన ఉనికిని చాటుతున్న Huaweiపై త్వరలోనే బ్యాన్ విధించే ఛాన్స్‌లు ఉన్నాయా అంటే.? కేంద్ర వర్గాల నుంచి అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి.

ఇక ఇప్పుడు చైనా దుందుడుకుతనానికి పూర్తిగా కళ్లెం వేసేందుకు 5జీ పరికరాలపై నిషేధం విధించే అంశంపై మంత్రులు కీలక విషయాలను చర్చించారని కేంద్రవర్గాలు తెలిపాయి.

Huawei అధినేతకు, చైనా కమ్యూనిస్ట్ పార్టీకి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ పలు ఆరోపణలు రావడంతో అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ నిషేధిస్తూ కఠిన నిర్ణయం తీసుకున్నారు.

భారత్, బ్రిటన్ దేశాలు కూడా ఇలాంటి చర్యలే తీసుకోవాలని కూడా అమెరికా కోరింది.

కాగా, ఇప్పటికే కేంద్రం 4జీకి సంబంధించి చైనా పరికరాలు వాడొద్దంటూ బీసీసీఐకి ఆదేశాలు ఇచ్చింది.

దీనితో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నుంచి త్వరలోనే మరో సంచలన ప్రకటన రానుంది.!