DailyDose

జీవీకెపై సీబీఐ కేసు-నేరవార్తలు

CBI Files Case On GVK And His Son Sanjay Reddy For 705 Crore Scam

* ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి, నిర్వహణలో నిధుల దుర్వినియోగానికి సంబంధించి జీవీకే గ్రూప్‌ కంపెనీస్‌ ఛైర్మన్‌ జి.వి.కృష్ణారెడ్డి, ఆయన కుమారుడు, విమానాశ్రయ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంజయ్‌రెడ్డిపై సీబీఐ కేసు నమోదు చేసింది. రూ.705 కోట్ల అక్రమాలకు సంబంధించి ఈకేసు నమోదైంది. విమానాశ్రయం అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌.. జీవీకే ఎయిర్‌పోర్టు హోల్డింగ్స్‌ లిమిటెడ్‌తో కలిసి జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు చేసింది. ఇందులో ముంబయి విమానాశ్రయ అభివృద్ధి, నిర్వహణ కోసం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య సంస్థ మియాల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. 2017-18లో బోగస్‌ కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చినట్టు చూపించి నిధులను దారి మళ్లించినట్టు సీబీఐ ఆరోపించింది. ఈ కేసులో జీవీకే రెడ్డి, సంజయ్‌రెడ్డి సహా మియాల్‌, జీవీకే ఎయిర్‌పోర్టు హోల్డింగ్స్‌ లిమిటెడ్‌, మరో తొమ్మిది కంపెనీలు, ఎయిర్‌ పోర్టు అథారిటీకి చెందిన కొందరు అధికారులపై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది.

* పొందుగల, చండ్రగుడెం గ్రామాల్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ పెద్దిరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీ ల లో ముగ్గురు వ్యక్తుల ను అదుపులోకి తీసుకొని వారివద్ద నుంచి 378 మద్యం బాటిళ్లు, ఒక ఆటో, రెండు ద్విచక్ర వాహనాల ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని మీడియా సమావేశంలో తెలిపారు. అక్రమ మద్యం రవాణా చేసేవారి పై కఠిన చర్యలు తీసుకుంటామని పెద్దిరాజు ఈ సందర్భంగా హెచ్చరించారు.

* గన్నవరం దావాజీగూడెం విమానశ్రయ రన్ వే విస్తరణలో ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు అర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద కేటాయించిన ఇళ్ల స్ధలాలుకి శాశ్వత పట్టాలు ఇవ్వాలంటూ నిర్వాసితులు గన్నవరం- ఉంగుటూరు రహదారి పై బైఠాయించి అందోళన చేపట్టారు. రన్ వే విస్తరణ సమయంలో ఇళ్లు కోల్పోయిన పేదలకు అర్ అండ్ అర్ ప్యాకేజీలో ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చి మూడేళ్ల గడుస్తున్నా ఏటువంటి పురోగతి లేదని.. ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో అందోళన చేపట్టామని నిర్వాసితులు అవేదన వ్యక్తం చేశారు.దింతో పాటు మాకు కేటాయించిన 5 సెంట్ల భూమి శాశ్వత పట్టా ఇవ్వకుండా ఆ స్థలాలలో ఫ్లాట్లు వేసి మరోకరికి కేటాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేయటంతో పాటు అధికారులు ఫ్లాట్లు వేసెందుకు ఏర్పాటు చేసిన సరిహద్దు రాళ్ళను పీకేసి నిరసన తెలిపారు.

* ఈరోజు ఉదయం వచ్చిన సమాచారం మేరకు పెడన రోడ్ లో వారి సిబ్బంది తో కలసి సిఐ వాహనములు తనికి చేయుచుండగా మార్కెట్ యార్డు కమిటీ మాజీ చైర్మన్ అయిన మీకు భాస్కర్ రావు హత్య కేసులో ముద్దాయిలు అయిన మచిలీపట్నం, ఉల్లింగిపాలెం కు చెందిన 1). చింతా చిన్నీ, 2). చింతా నాంచారయ్య పులి, 3 జవనైల్ అను వారిని పై కేసులో ముద్దాయిలుగా గుర్తించి ఇద్దరినీ అరెస్టు చేసి, మూడవ వ్యక్తి జునైల్ అయినందున తగు చర్య నిమిత్తం అతనిని అదుపులోనికి తీసుకున్నారు.

* మైలవరం మండలం పొందుగుల సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 882 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు. ముగ్గురు మహిళలు, ఆటో డ్రైవర్ అరెస్ట్, ఆటో సీజ్..వీళ్ళు ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి ఇందిరమ్మ కాలానికి చెందినవారు.

* ఈఎస్ఐ స్కాం లో మాజీ మంత్రి అచ్చంనాయుడు ఏసీబీ అధికారులు మరోసారి విచారించేందుకు ఏసీబీ ఇంచార్జి కోర్ట్ లో పిటిషన్ వేసే అవకాశం.అచ్చెన్నాయుడు బెయిల్ పై బయటకి వెళ్తే సాక్షులను ప్రలోభ పెట్టె అవకాశం.ఈ నేపథ్యంలో అచ్చంనాయుడు కి బెయిల్ ఇవ్వకుండా ఏసీబీ కస్టడీకి ఇవ్వాలని కోరే అవకాశం.