NRI-NRT

నన్ను గెలిపిస్తే…ట్రంప్ H1B ఆంక్షలు ఎత్తివేస్తాను.

నన్ను గెలిపిస్తే…ట్రంప్ H1B ఆంక్షలు ఎత్తివేస్తాను.

అమెరికా మాజీ వైస్ ప్రెసిడెంట్, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ ప్రెసిడెంట్ అభ్యర్థి జో బిడెన్(77) భారతీయ ఐటీ నిపుణులకు తీపి కబురు అందించారు. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధిస్తే హెచ్1 బీ వీసాలపై ట్రంప్ సర్కార్ విధించిన తాత్కాలిక సస్పెన్షన్‌ను ఎత్తివేస్తానని ప్రకటించారు. అధ్యక్ష పదవిలో మొదటి 100 రోజుల పరిపాలనలో చేపట్టబోయే కీలక చర్యలపై ప్రశ్నించినపుడు బిడెన్ ఈ ప్రకటన చేయడం విశేషం.