Movies

నా బరువు వాళ్లు మోస్తారు

నా బరువు వాళ్లు మోస్తారు

తన నటన, అందంతో ఆకట్టుకున్న నటి నిత్యామేనన్‌. గతంలో తన శరీర బరువు విషయంలో ఎంతోమంది నుంచి విమర్శలు ఎదుర్కొన్నట్లు చెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ……‘‘అవును. మీరు తప్పకుండా అలాంటి వారి బారిన పడి ఉంటారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. నీకన్నా ఎక్కువ బరువు ఉన్న వాళ్ల నుంచి నీకు ఎలాంటి విమర్శలు ఎదురుకావు. అయితే, నీకన్నా సన్నగా ఉన్నవాళ్లే నిన్ను విమర్శిస్తారు. నువ్వు ఎందుకు బరువు పెరుగుతున్నావ్‌? అని ఎవరూ అడగరు. అంతా వాళ్లు ఊహించుకుంటారు. అందులో చాలా ప్రశ్నలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు ఉన్నాయని అనుకుంటారు. అంతకన్నా ఎక్కువగానే ఆలోచిస్తారు’’ అని నిత్యామేనన్‌ చెప్పుకొచ్చారు.