NRI-NRT

డెన్మార్క్‌లో పీవీకి ఘననివాళి

PVNR100 In Denmark By TRS And NRTs

డెన్మార్క్ లో మాజీ భారత ప్రధాని పీవీ నరసింహరావు శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. చిత్రపటానికి పూలమాల వేసి భారతదేశానికి వారు చేసిన సేవలను కొనియాడారు. రూపాయినోటు మీదనున్న అన్నె భాషలు మాట్లాడగలిగిన మేధావి పీవీ అని శ్లాఘించారు. తెరాస ప్రధాన కార్యదర్శి,డెన్మార్క్ తెలుగు సంఘము ఎక్స్ ప్రెసిడెంట్ ప్రసాదరావు కల్వకుంట్ల, యూరోప్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్ శ్యామ్ బాబు ఆకుల, తెలంగాణ అసోసియేషన్ అఫ్ డెన్మార్క్ అధ్యక్షుడు రాజు కుమార్ కలువల, టీఆరెస్ డెన్మార్క్ ప్రెసిడెంట్ జయచందర్ గంట, తెలంగాణ జాగృతి ప్రెసిడెంట్ సంతోష్ రావు బోయినపల్లి, టీఆరెస్ డెన్మార్క్ వైస్ ప్రెసిడెంట్ వెన్నపూ రెడ్డి చంద్రశేఖరరెడ్డి, ట్రెజరర్ సంతోష్ కుమార్ గంజి,సురేష్ కుమార్ కట్ట, బండారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.