Health

బైపాస్ తర్వాత ఒంటరితనం వేధిస్తోందా?

2020 Telugu Health News - Loneliness After Bypass Surgery

ఒంటరితనం మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.. ఇది ఒత్తిడిని తెచ్చి పెడుతుంది. దీని ఫ‌లితంగా మ‌నిషి భావోద్వేగాలపై అదుపు కోల్పోతాడు. అస‌లు ఈ కార‌ణాల వ‌ల్లే గుండె సంబంధిత ఆప‌రేష‌న్లు ఎక్కువ‌వుతున్నాయి. గుండె ఆప‌రేష‌న్ త‌ర్వాత ఒంట‌రిత‌నానికి గురైతే మాత్రం ప్రాణాలు కోల్పోతున్నార‌ని ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డైంది. ఆపరేషన్ తర్వాత మనిషి ఒంటరితనాన్ని భరించలేక మానసికంగా, శారీరకంగా కుంగిపోతున్నట్లు డెన్మార్క్‌లోని కోపెన్‌హగెన్‌ వర్సిటీ పరిశోధకులు గుర్తించారు. 2013-14 మధ్య గుండె వైద్యం చేయించుకున్న 13,000 మంది రోగుల జీవనశైలిని పరిశీలించి ఈ విషయాన్ని వెల్లడించారు. రోగుల శారీరక, మానసిక ఆరోగ్యం, వారు తీసుకుంటున్న ఔషధాలు, వారి అలవాట్ల వివరాలను కూడా పరిశీలించారు. గుండె సంబంధిత శస్త్రచికిత్సలు చేయించుకున్న అనంతరం రోగులు ఒంటరి తనానికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.