Food

విటమిన్ల గని…జున్ను

Nutrition and health benefits of junnu - telugu food news

జున్నులో పాలకంటే అధిక మోతాదులో పోషక విలువలు ఉంటాయి. దీనిని ఎలా తిన్నా ఆరోగ్యానికి ఎంతో మేలని వైద్యులు చెబుతున్నారు. చాలామంది చూడటానికి చాలా సన్నగా ఉంటారు. అలాంటివారు ప్రతిరోజూ జున్ను తీసుకుంటే మంచిది. జున్నులోని ప్రోటీన్స్ శరీరానికి కావలసిన ఎనర్జీని అందిస్తాయి. తరచూ దీనిని తింటే.. జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. జున్నులో విటమిన్-డి పుష్కలంగా ఉంటుంది. శరీరంలో డి-విటమిన్ లోపంతో కలిగే ఆస్టియోపోరోసిస్ లోపాలను అధిగమించడం వల్ల ఆరోగ్యంగా ఉండడంతో పాటు పుష్టిగా ఉంటారు. జున్నులో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎముకలు, దంతాల బలానికి ఎంతో దోహదపడుతుంది.

గర్భిణి స్త్రీలు ప్రతిరోజూ రెండుపూటలా జున్నులో కొద్దిగా చక్కెర లేదా తేనె కలిపి తీసుకుంటే శిశువు ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది. తల్లిపాలు కూడా వృద్ధి చెందుతాయి. జున్ను విరేచననాలు, మలబద్దక సమస్యలను తొలగిస్తుంది. మధుమేహ వ్యాధితో బాధపడేవారు.. రోజుకు ఒక్కసారైనా జున్ను తింటే.. వ్యాధి తగ్గుముఖం పడుతుంది. దాంతో శరీర రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అంతేకాకుండా జున్నులో ఫైబర్ చాలా సమృద్ధిగా ఉంది. ఇది మన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో చాలా సహాయపడుతుంది. జున్నులోని విటమిన్ బి2, ఎ, కె, డి వంటివి జీవక్రియలు సరిగ్గా జరిగేలా చేస్తాయి. జున్ను తినడం ద్వారా మీ జీర్ణవ్యవస్థ కూడా చాలా బలంగా ఉంటుంది.

అందమైన ముఖం కోసం జున్నును ఉపయోగించవచ్చు. ఒక స్పూన్ ఓట్స్‌లో రెండు స్పూన్ల జున్ను వేసి పేస్ట్ తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసుకోవాలి. పది నిమిషాల తర్వాత కడిగేస్తే ముఖం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. వాతావరణ కాలుష్యం వల్ల ముఖం అలసిపోయి, నిర్జీవంగా మారుతుంది. అలాంటపుడు జున్నుతో మర్దన చేయడం వల్ల దీనిలోని యాంటీ ఏజింగ్ గుణాలు సమస్యను పరిష్కరిస్తాయి.