NRI-NRT

ట్రంప్ కొడుకు స్నేహితురాలికి కరోనా

Jr Trump Girlfriend Tested Positive For Corona

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ పెద్ద కుమారుడు జూనియర్‌ ట్రంప్‌ స్నేహితురాలు కింబర్లీ గుయిల్‌ ఫాయల్‌కు కరోనా వైరస్‌ సోకింది. ఈ విషయాన్ని అమెరికా మీడియా వెల్లడించింది. గతంలో ఫాక్స్‌ న్యూస్‌లో పనిచేసిన ఆమె ప్రస్తుతం ట్రంప్‌ ఎన్నికల ప్రచార బృందంలో సీనియర్‌ ఫండ్‌ రైజర్‌గా వ్యవహరిస్తున్నారు. ట్రంప్‌ ఆంతరంగీకుల్లో తాజాగా ఈ వైరస్‌ బారినపడింది కింబర్లీనే కావడం విశేషం. ఈ ఘటనతో అమెరికాలో వైరస్‌ ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది.