Fashion

గడ్డానికి శృంగారానికి సంబంధం ఇది!

గడ్డానికి శృంగారానికి సంబంధం ఇది!

ఒకప్పుడు గడ్డం ఉంటే ఏంటి బాస్ లవ్ ఫెయిల్యూరా అని అనేవారు.. కానీ ప్రజెంట్ మాత్రం.. వావ్ చాలా బాగుంది నీ లుక్ అంటూ పొగిడేస్తున్నారు. గడ్డం అనేది నేటి ట్రెండ్, ఫ్యాషన్. ఇది కేవలం అందం దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

గడ్డం చూసేందుకు క్రేజీ గా ఉంటుంది.. దీని వల్ల ఎంతో మేలు కూడా. గడ్డంలోని కణాల మీద జరిపిన ఒక అధ్యయనంలో 8 ఆశ్చర్యపరిచే వాస్తవాలు బయటపడ్డాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

సూర్య కిరణాల నుంచి రక్షణగా..

చర్మం ఎండకు ఎక్కువగా ఉంటే.. డ్రై స్కిన్, బ్లాక్ హెడ్స్, ముడతలు, చారల వంటి సమస్యలు ఎదురవుతాయి” అని గ్రీన్విచ్ విలేజ్ డెర్మటాలజీ వ్యవస్థాపకుడు & మౌంట్ సినాయ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ సెక్షన్ చీఫ్ చర్మ వ్యాధి నిపుణుడు బాబీ బుకా అంటున్నారు. అంతేకాకుండా “డెర్మాటోహెలియోసిస్” అని పిలువబడే ఓ చర్మ సమస్యని ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. దీనికారణంగా మచ్చలు, చారలు, ముడతలతో కూడిన చర్మానికి దారితీస్తుందని పేర్కొన్నారు.

జోన్హా రెవెన్సెన్సియో తన హఫ్పోస్ట్ బ్లాగ్‌లో పేర్కొన్నట్లుగా, “గడ్డం మిమ్మల్ని హాట్ గా ఎలా చూపిస్తుంది? అనడానికి సైన్స్ దగ్గర థియరీ ఉంది” అని తెలిపింది. ఆ ప్రకారం, గడ్డం సూర్యుని హానికరమైన అతినీల లోహిత కిరణాలను 95 శాతం వరకు నిరోధించగలదని పేర్కొంది. దీంతో గడ్డం సూర్యరశ్మి ప్రభావాన్ని తగ్గిస్తుందని, చర్మ కాన్సర్ బారినపడే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని దక్షిణ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులను టాగ్ చేస్తూ రెవెన్సెన్సియో వివరించారు.

లైంగిక జీవితంలోనూ…

ఓ అధ్యయనం ప్రకారం గడ్డం పెరుగుదల, సెక్స్ సంభావ్యత మధ్య పరస్పర సంబంధం ఉంది. “గడ్డం పెంచడం, లైంగిక కార్యకలాపాల పునఃప్రారంభానికి దోహదం చేస్తుంది” అని ఈ ప్రయోగం జరిపిన రచయిత కనుగొన్నాడు. తరచుగా లైంగిక విషయాల్లో పాలుపంచుకునేవారిలో, టెస్టోస్టెరాన్ హార్మోన్ స్రావం పెరుగుతుంది, ఇది గడ్డం పెరుగుదలను ప్రభావితం చేస్తుందని తేలింది..

కాబట్టి, ఎక్కువ సెక్స్ చేయడం మూలంగా ఎక్కువ గడ్డం వస్తుందా? లేదా ఎక్కువ గడ్డం ఉంటే.. క్స్ సామర్ధ్యం పెరుగుతుందా ?! అంటే, రెండింటికి అవినాభావ సంబంధం ఉందనే చెప్పొచ్చు. సాధారణంగా “మహిళలు, గడ్డం ఉన్న మగవారినే ఎక్కువగా ఇష్టపడతారు.

ఆస్తమా దూరం..
గొంతు వ్యాధి లానే , గడ్డం మీ శరీరానికి, విషపూరిత ఎక్స్‌పోజర్స్ నుంచి దూరం చేస్తుంది. “మీకు ఉబ్బసం వంటి శ్వాస సంబంధిత సమస్య ఉన్నట్లయితే, ఈ విషపూరిత కణాలు మీ ఊపిరితిత్తులలోకి ప్రవేశించే ముందు గడ్డం అదనపు ఫిల్టర్‌గా పని చేస్తుంది”.

బ్యాక్టీరియా దూరం..

గడ్డాలు ఇన్ఫెక్షన్ల నుండి కాపాడతాయి. బ్యాక్టీరియా సహజంగానే చర్మంపై ఉన్నా.. షేవింగ్ చేయడం సమస్యలను దూరం చేస్తుంది. అంతేకాకుండా ఇన్‌ఫెక్షన్లు, వెంట్రుకలు చర్మం లోపలికి పెరగడానికి దారితీస్తుంది. షేవింగ్ చేయకపోవడం ద్వారా, మొటిమల మంటను కూడా తగ్గుతుంది. షేవింగ్ అనేది మొటిమల బ్రేక్‌అవుట్‌ల కు దారితీస్తుంది. ఇప్పటికే ఉన్న మొటిమల సమస్యను దిగజార్చుతుంది. అంతేకాకుండా మొటిమలకు సంబంధించిన చర్మ వ్యాధులను దూరం చేస్తుంది. .

సమయం ఆదా..

1972 లో, బోస్టన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రొఫెసర్ & డెర్మటాలజీ విభాగం ఛైర్మన్ డాక్టర్ హెర్బర్ట్ మెస్కాన్ “ది స్పార్టన్బర్గ్ హెరాల్డ్” తో మాట్లాడుతూ, సగటు మనిషి తన జీవిత కాలంలో షేవింగ్ కోసం అత్యధికంగా 3,350 గంటలు గడుపుతారని చెప్పారు. అనగా పూర్తిస్థాయిలో 139 రోజులు! దాదాపు ఐదు నెలలు! గడ్డం పెంచడం ద్వారా, మిమ్మల్ని ఆ సమయం వృధా కాకుండా కాపాడుతుంది.

అందంగా కనిపిస్తారు..

జర్మన్ కన్జ్యూమర్ గూడ్స్ సంస్థ అయిన “బ్రాన్” గత సంవత్సరం 1,000 మంది న్యూయార్క్ పురుషులను వారి వస్త్రధారణా పద్ధతుల గురించిన వివరాలు తీసుకున్నారు. సర్వే చేసిన పురుషులలో 67 శాతం మంది, గడ్డం, మీసాలతో ఆకర్షణీయంగా ఉంటామనగా, 55 శాతం మంది గడ్డం, మీసం కారణంగానే ఫుల్ కాంప్లిమెంట్స్ అందుకున్నామని చెప్పారు, ఇక 41 శాతం మంది గడ్డం తమకు మరింత కాన్ఫిడెన్స్ ఇస్తుందని చెప్పారు.

వెచ్చగా ఉండేలా..

ఉష్ణోగ్రతలు తగ్గుతున్నప్పుడు, మీ గడ్డం మిమ్మల్ని వెచ్చగా ఉంచేందుకు సహాయం చేస్తుంది. “ముఖ్యంగా శీతాకాలంలో ముఖం మీద జుట్టును కలిగి ఉండటం, ఆయా ప్రాంతాలలో చర్మ రక్షణకు అనుకూలంగా ఉంటుంది” బుకా, హఫ్పోస్ట్ తో చెప్పారు. “చర్మం మీద గాలి, శీతల వాతావరణం ప్రభావితం అయ్యేటప్పుడు, గడ్డం శరీర రక్షణగా పనిచేస్తుంది.”

గొంతు వ్యాధి దూరం..

ముఖం మీది జుట్టు మీ నోటిని గాలిలో ఉండే బ్యాక్టీరియాని దూరం చేస్తుంది. క్రమంగా ఇది మీ గొంతును రక్షించడంలో సాయపడుతుంది.

పల్మనరీ క్షయ: దాని పాథాలజీ, విధానం, లక్షణాలు, రోగ నిర్ధారణ, కారణాలు, పరిశుభ్రత వైద్య చికిత్స పుస్తకంలో, డాక్టర్ అడిసన్ పి. డచర్ ఇలా చెబుతున్నాడు. గడ్డం, ముక్కు రంధ్రాలలో పెరిగే వెంట్రుకలు ప్రకృతి సిద్దంగా హానికర కణాల దాడి నుండి ఊపిరితిత్తులను కాపాడతాయి.