WorldWonders

నీ మాస్కు “బంగారం” కాను!

This man's golden mask will wow you

క‌రోనా వైర‌స్ నుంచి త‌ప్పించుకోవాలంటే.. మాస్క్ పెట్టుకోవాల్సిందే. ఈ నిబంధ‌న ఇప్పుడు దాదాపు అంద‌రూ పాటిస్తున్నారు. వెరైటీ వెరైటీ మాస్క్‌లు కూడా ధ‌రిస్తున్నారు.

ఇక పుణెకు చెందిన ఓ వ్య‌క్తి మాత్రం ఏకంగా బంగారు మాస్క్‌ను పెట్టుకున్నాడు. 

పింప్రి చించ్‌వాడ‌కు చెందిన శంక‌ర్ కుర్‌హేడ్ అనే వ్య‌క్తి సుమారు 2 ల‌క్ష‌ల 90 వేల ఖ‌రీదైన గోల్డెన్ మాస్క్‌ను త‌యారు చేయించుకున్నాడు.

ఈ మాస్క్ కోసం సుమారు అయిదున్న‌ర తులాల బంగారం వాడిన‌ట్లు తెలుస్తోంది.  

శంక‌ర్ అయిదు చేతి వేళ్ల‌కు బంగారు ఉంగ‌రాలు కూడా ఉన్నాయి.  అత‌ని మెడ‌లో భారీ పుత్త‌డి దండ కూడా ఉన్న‌ది.

ఇప్ప‌టికే ధ‌గ‌ధ‌న మెరుస్తున్న అత‌నికి ఇప్పుడు గోల్డెన్‌ మాస్క్ కూడా తోడైంది. 

బంగారంతో త‌యారైన మాస్క్ మందంగా ఉన్న‌ద‌ని, వాటికి చిన్న చిన్న రంథ్రాలు ఉన్నాయ‌ని శంక‌ర్ తెలిపాడు.

శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది లేద‌న్నాడు. అయితే ఈ మాస్క్ ఎంత వ‌ర‌కు ప‌నిచేస్తుందో చెప్ప‌లేమ‌న్నాడు.