DailyDose

₹2500లకు కరోనా లేదని వైద్య సర్టిఫికెట్-నేరవార్తలు

₹2500లకు కరోనా లేదని వైద్య సర్టిఫికెట్-నేరవార్తలు

* క‌రోనా ప‌రీక్ష చేయించుకుంటే పాజిటివ్ వ‌స్తుందా నెగిటివ్ వ‌స్తుందా అని భ‌య‌ప‌డ‌క్క‌ర్లేదు.. క‌రోనా ఉన్న‌ప్ప‌టికీ దాన్ని లేకుండా చేయ‌గ‌లం.. మీకు ఎలాంటి చింత అవ‌స‌రం లేకుండా క‌రోనా నెగిటివ్ స‌ర్టిఫికెట్ ఇస్తాం అంటూ బంప‌ర్‌ ఆఫ‌ర్ ఇస్తోంది ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని మీర‌ట్ ఆస్ప‌త్రి. ఇందుకోసం కేవ‌లం 2,500 రూపాయ‌లు చెల్లిస్తే స‌రిపోతుంద‌ని ప్ర‌క‌టించింది. మ‌నుషుల ప్రాణాల‌తోనే వ్యాపార‌మా.. అని ఈ విష‌యం తెలిసిన వారు నోరెళ్ల‌బెడుతున్నారు. య‌థేచ్ఛ‌గా న‌కిలీ స‌ర్టిఫికెట్లు జారీ చేస్తున్న న్యూ మీర‌ట్‌ ఆస్ప‌త్రిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ అధికారులు దాన్ని మూసివేయ‌డంతోపాటు ఆస్ప‌త్రి నిర్వాహ‌కుల‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు.

* పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి లో వున్న ప్రభుత్వ మద్యం షాపు లో గతనెల 14 వ తేదీ రాత్రి జరిగిన దొంగతనం కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసారు. కేసు దర్యాప్తులో భాగంగా తెలంగాణా రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట కు చెందిన పిల్లి వెంకటేశ్వరరావు ఈ దొంగతనం చేసినట్లు గుర్తించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నిందితుడు తన నేరం అంగీకరించాడని పోలీసులు తెలిపారు. నిందితుడి వద్ద నుండి 1,30,000/- రూపాయలు విలువ చేసే 406 మద్యం సీసాలు, ఒక మోటార్ సైకిల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

* హిందూపురం లో పోలీసు కానిస్టేబుళ్ల నిర్వాకం..పోలీసు స్టేషన్ లో మద్యం తాగిన కానిస్టేబుళ్లు తిరుమలేష్, నూర్ మహ్మద్..ఇటీవల కర్నాటక మద్యం బాటిళ్లను సీజ్ చేసిన స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో అధికారులు…సీజ్ చేసిన లిక్కర్ ను పోలీసు స్టేషన్ విచారణ గదిలో తాగిన కానిస్టేబుళ్లు…కెమెరాలో అడ్డంగా బుక్కయిన హిందూపురం పోలీసులు.

* మైదుకూరు లో ముగ్గురు మోటార్ బైక్ దొంగలు అరెస్టు.15 లక్షల విలువైన 12 మోటారు సైకిళ్ళను స్వాధీనం చేసుకున్న మైదుకూరు పోలీసులు.మైదుకూరు మండలం జీవీ సత్రంతో పాటు, నెల్లూరు, తిరుపతి, విజయవాడల్లో బైక్ దొంగతనాలు చేసిన దుండగులు.