Movies

పాయల్ పుకార్లు

పాయల్ పుకార్లు

‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమాతో గ్లామరస్‌ హీరోయిన్‌ గా పేరు తెచ్చుకున్నారు పాయల్‌ రాజ్‌పుత్‌. ఆ తర్వాత ‘వెంకీమామ’, ‘డిస్కోరాజా’ చిత్రాల్లో ఒక హీరోయిన్‌ గా నటించిన పాయల్‌ ‘సీత’ (2019) చిత్రంలో ఓ స్పెషల్‌సాంగ్‌ చేశారు. లేటెస్ట్‌గా కమల్‌హాసన్‌ ‘ఇండియన్‌ 2’, అల్లు అర్జున్‌ ‘పుష్ప’ చిత్రాల్లో ఆమె ప్రత్యేక పాటలు చేయబోతున్నారనే వార్తలొస్తున్నాయి. ఈ విషయంపై పాయల్‌ స్పందించారు. ‘‘నా గురించి ఇలాంటి పుకార్లు ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ‘ఇండియన్‌ 2’, ‘పుష్ప’ చిత్రాల్లో నేను స్పెషల్‌ సాంగ్స్‌ చేయడానికి ఇప్పటికింకా అంగీకరించలేదు. ఆ రెండు సినిమాల్లో ప్రత్యేకమైన పాటల్లో నేను నర్తించబోతున్నాననే వార్తలు నిజం కాదు.. కేవలం పుకార్లు మాత్రమే. ప్రస్తుతం నేను ఏ సినిమా షూటింగ్‌లో పాల్గొనడం లేదు కూడా. ప్రస్తుతానికి చాలా స్క్రిప్ట్స్‌ చదువుతున్నాను. ఏదైనా సినిమాకు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తే నేనే చెబుతా’’ అని సోషల్‌మీడియా వేదికగా పేర్కొన్నారామె.