DailyDose

ఒక్కరోజులో పాతికవేల కేసులు-TNI బులెటిన్

ఒక్కరోజులో పాతికవేల కేసులు-TNI బులెటిన్

* దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రమవుతూనే ఉంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 24,248 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,97,413కి చేరింది. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం.. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 2,53,287 ఉండగా.. 4,24,433 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు కరోనా బారిన పడి 19,693 మంది మృతి చెందారు. నిన్నటి వరకు మొత్తం 99,69,662 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్‌ వెల్లడించింది

* కరోనాకు 2021 కంటే ముందుగా వ్యాక్సిన్‌ సిద్ధమయ్యే అవకాశంలేదని కేంద్రప్రభుత్వం ప్రకటించింది.

* ఆంధ్రప్రదేశ్ (కరోనా సమాచారం)

06-07-2020 {10:00 ఆం}

★ ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ 207 బులిటెన్ విడుదల..!!

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి రికార్డ్ స్థాయిలో కొనసాగుతోంది.

★ గడచిన 24 గంటల్లో 16,712 మంది నమూనాలు పరీక్షించగా 1322 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది.

★ అయితే, వీటిలో విదేశాలకు చెందిన ముగ్గురు, పొరుగు రాష్ట్రాలకు సంబంధించిన 56 కేసులు ఉండగా..  రాష్ట్రంలో 1263 పాజిటివ్‌ కేసులు వచ్చాయి.

★ పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 20,019 కేసులు నమోదయ్యాయి.

★ కొవిడ్‌ కారణంగా గడచిన 24 గంటల్లో శ్రీకాకుళంలో ఇద్దరు, అనంతపురంలో ఒక్కరు, చిత్తూరులో ఒక్కరు, గుంటూరులో ఒక్కరు, కృష్ణలో ఒక్కరు మరియు విశాఖపట్నంలో ఒక్కరు మృతి చెందారు.

* ఇచ్చాపురంలో 14 రోజులు లాక్ డౌన్ – జిల్లా కలెక్టర్ జె నివాస్.తాగునీరు, పాలు, నిత్యావసర సరుకులు, మందులు మినహా అన్ని దుకాణాలు మూసివేత.కాంటైన్మెంట్ జోన్ లో ఏ దుకాణానికి అనుమతి లేదు.ఉదయం 6 నుండి మధ్యాహ్నం 1 వరకు మాత్రమే నిత్యావసర సరుకులకు అనుమతి.ఇచ్చాపురంలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా నిర్ణయం.

* కరోనా వైద్య పరీక్షలు విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం బట్టబయలు అవుతోంది. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు నెగిటివ్ అంటూ సిబ్బంది సమాచారం ఇస్తోంది. కరోనా ల్యాబ్ నుంచి వచ్చిన పాజిటివ్ రిపోర్టులను నెగెటివ్‌గా సిబ్బంది వెబ్ సైట్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. రెండు రోజుల క్రితం కాకినాడ నగరంలో జగన్నాయక్‌పూర్‌లో ఒక యువకుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మీకు కరోనా పాజిటివ్ వచ్చిదంటూ ఆదే రోజు మధ్యాహ్నం పోలీసులు సమాచారం ఇచ్చారు. లేదు నెగిటివ్ వచ్చిందంటూ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తెలిపింది. మరల నిన్న మీకు కరోనా పాజిటివ్ అంటూ క్వారంటైన్ కు వెళ్ళడానికి సిద్ధమవ్వాలని బాధితుడుకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తెలిపారు. ఇదేంటని ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానాలు చెప్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆన్‌లైన్‌లో కరోనా నెగెటివ్‌గా యువకుడి రిపోర్ట్ చూపిస్తోంది. దీంతో అసలు తనకు కరోనా పాజిటివా? లేక నెగెటివా? అని తెలియక సదరు యువకుడు ఆందోళన చెందుతున్నాడు.

* తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా వైరస్ బారిన పడిన 197 మంది జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందించినట్లు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. వీరిలో పాజిటీవ్ లు వచ్చిన 128 మంది జర్నలిస్టులకు 20 వేల రూపాయల చొప్పున 25 లక్షల 60 వేల రూపాయల ఆర్థిక సహాయం, అదే విధంగా హోంక్వారైంటైన్ లో ఉన్న 69 మంది జర్నలిస్టులకు 10 వేల రూపాయల చొప్పున 6 లక్షల 90 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. మొత్తంగా 32 లక్షల 50 వేల రూపాయలను మీడియా అకాడమి నిధుల నుండి ఈ సహాయం అందించామని తెలిపారు. కరోనా బారిన పడుతున్న జర్నలిస్టులకు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి అండగా నిలుస్తుందని ఆయన తెలిపారు.