Politics

తెలంగాణా నూతన సచివాలయం విశేషాలు

Telagnana Secretariat Demolishment Begins

తెలంగాణ సచివాలయ భవన కూల్చివేత పనులు ప్రారంభించిన ప్రభుత్వం నూతన భవన నమూనాను ఖరారు చేసింది. ఇందుకు సంబంధించిన నమూనా ఫొటోను ముఖ్యమంత్రి కార్యాలయం తాజాగా విడుదల చేసింది. చూడడానికి రాజప్రాసాదంలా ఉన్న ఈ నమూనా ఆకట్టుకునేలా ఉంది. భవనం ముందున్న నీటి కొలనులో భవనం ప్రతిబింబిస్తోంది. నూతన సచివాలయాన్ని నిర్మించాలని ప్రభుత్వం ఎప్పటి నుంచో అనుకుంటున్నా కోర్టు కేసుల కారణంగా ఇన్నాళ్లూ వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా, పాత భవనం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ ఉదయం భవనం కూల్చివేత పనులను ప్రభుత్వం ప్రారంభించింది.

సచివాలయ భవనం కూల్చివేత ప్రక్రియ ప్రారంభంహైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనాల కూల్చివేత ప్రక్రియ ప్రారంభమైంది.తెల్లవారుజాము నుంచే భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేత పనులు మొదలుపెట్టారు.సచివాలయం వైపు వెళ్లే మార్గాలను పోలీసులు మూసివేశారు.కొత్త సచివాలయ నిర్మాణం చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం గతంలో నిర్ణయించిన విషయం తెలిసిందే.ప్రస్తుత సచివాలయ భవనాలను కూల్చివేసి కొత్తగా నిర్మించాలని భావించింది. అయితే ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.ఆ పిటిషన్లను విచారిస్తూ వచ్చిన ఉన్నత న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెల్లడించింది.కొత్త సచివాలయ భవనం నిర్మాణం కోసం ప్రస్తుత భవనాల్ని కూల్చివేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.దీంతో ప్రభుత్వం కొత్త భవనం నిర్మాణం దిశగా చర్యలు తీసుకుంటోంది.ప్రస్తుతం సీ బ్లాక్‌ను భారీ యంత్రాలతో కూల్చివేస్తున్నారు.