DailyDose

తిరువూరు ఆర్టీసీ బస్సులో అక్రమ మద్యం రవాణా-నేరవార్తలు

Telugu Crime News Roundup Today - Illegal Liquor Transport In Tiruvuru Depot RTC Bus

* అక్రమ మద్యంపై జగన్ ప్రభుత్వం కొత్త చట్టం!!అక్రమంగా మద్యం అమ్మినా, పక్క రాష్ట్రాల నుండి తరలించినా ఆప్ ఎక్షిజె అచ్త్: 17 ప్రకారం నాన్ బెయిలబుల్ కేసు, 8 సంవత్సరాల జైలు శిక్ష.

* తిరువూరు డిపో బస్సులో ఇద్దరు వ్యక్తులు రెండు బ్యాగుల్లో మద్యం తీసుకెళ్తున్నారన్న సమాచారంబైపాస్ లో బస్సును నిలిపి తనిఖీ చేపట్టిన ఎస్సై సుబ్రహ్మణ్యంపది మద్యం ఫుల్ బాటిళ్లు మాన్షన్ హౌస్ ఉన్నట్లు గుర్తించిన అధికారులుగుంపులో గోవిందా అని ఆ అక్రమ రవాణా దారులు తప్పించుకున్న వైనంవారు రిజర్వేషన్ ద్వారా బస్సు ఎక్కరా, లేకా టికెట్ తీసుకుని రవాణా చేస్తున్నారా అని క్షుణ్ణంగా ఆరా తీస్తున్న పోలీసులువారు ఎప్పటినుండి ఈ అక్రమ రవాణా ను కొనసాగిస్తున్నారు..అనే విషయంపై బస్టాండ్ లో ఉన్న సీసీ ఫుటేజ్ ను పరిశీలించనున్నట్లు తెలుస్తోంది.

* ఓ ఆర్ ఆర్ పై ఏపీ మంత్రి ఎస్కార్ట్ వాహనం బోల్తా.హెడ్ కానిస్టేబుల్ పాపయ్య మృతి మరో ముగ్గురు కానిస్టేబుల్లకి గాయాలు…పెద్ద అంబర్ పేట ఓ ఆర్ ఆర్ పై రోడ్ ప్రమాదం…ఏ పి మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఎస్కార్ట్ వాహనం టైర్ బ్లాస్ట్ అవ్వడం తో పల్టీకొడుతూ వెళ్లిన బొలెరో వాహనం…వాహనం లో ఉన్న ఒకరు మృతి .. ముగ్గురికి తీవ్ర గాయాలు…హయత్ నగర్ లోని హాస్పిటల్ కి తరలింపు…గచ్చిబౌలి నుండి విజయవాడకి వెళ్తుండగా ఘటన.

* విశాఖ జిల్లా ధారకొండలో 60 లక్షల రూపాయల విలువైన 1200 కేజీల గంజాయిని పట్టుకున్న పోలీసులు. ఇద్దరిని అరేస్టు చేసి లారీ సీజ్ చేసిన పోలీసులు

* విజయవాడ గ్యాంగ్ వార్ కేసులో మరో 5 గురిని అరేస్ట్ చేసిన పోలీసులు. అరెస్ట్ చేసిన నిందితుల నుంచి 5 సెల్ ఫోన్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్న పోలీసులు. నిందితులపై రౌడీషీట్ తెరుస్తామన్న పోలీసులు.