ScienceAndTech

హాంగ్‌కాంగ్‌కు టిక్‌టాక్ వీడ్కోలు

జాతీయ భద్రతా చట్టం అమల్లోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే హాంగ్‌కాంగ్‌ మార్కెట్‌ను వీడి బయటకు పోవాలని ప్రముఖ సోషల్‌ మీడియా యాప్‌ టిక్‌టాక్‌ నిర్ణయించింది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధి వెల్లడించారు. చాలా టెక్నాలజీ కంపెనీలు ఇప్పటికే హాంగ్‌కాంగ్‌ను వీడి బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. వీటిల్లో ఫేస్‌బుక్‌ కూడా ఉంది. ఆ ప్రాంతంలో ఫేస్‌బుక్‌ వినియోగదారుల డేటాను ప్రభుత్వానికి ఇచ్చే అంశాన్ని ఫేస్‌బుక్‌ పక్కనబెట్టింది. ‘‘ఇటీవల చోటు చేసుకొన్న పరిణామాలతో మేము హాంగ్‌కాంగ్‌లో మా యాప్‌ కార్యకలాపాలు నిలిపివేయాలని నిర్ణయించాము’’ అని బైట్‌డ్యాన్స్‌ ప్రతినిధి ఓ ఆంగ్ల వార్తా సంస్థకు వెల్లడించారు. కంపెనీ ప్రతినిధి కెవిన్‌ మేయర్‌ మాట్లాడుతూ వినియోగదారుల డేటాను గతంలో కూడా చైనాలో నిల్వ చేయలేదని పేర్కొన్నారు.