Health

ఖమ్మం జిల్లాలో 17 నూతన కేసులు-TNI బులెటిన్

TNILIVE Corona Bulletin - 17 New COVID19 Positive Cases In Khammam District

* కరోనా వైరస్‌ అత్యంత వేగంగా విస్తరిస్తున్నది. సోమవారం ఒక్క రోజే ఖమ్మం జిల్లాలో 17 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్‌ బి. మాలతి ఒక ప్రకటనలో తెలిపారు. ఎర్రుపాలెంలో ఒకరికి(66), కల్లూరులో ఒకరికి(39), రూరల్‌ మండలం వరంగల్‌ క్రాస్‌ రోడ్డులో ఒకరికి(50) పాజిటివ్‌గా రిపోర్ట్‌ వచ్చింది. నగరంలోని మామిళ్లగూడెంలో ఒకరికి(55), పాండురంగాపురంలో చిన్నారికి(6), అతడి తండ్రికి(29), పాకబండబజార్‌లో మహిళ(40)కు,  జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ముగ్గురు పురుషులకు, ఒక మహిళకు, నాయుడుపేటకు చెందిన ఒకరికి(54), ముస్తాఫానగర్‌లో యువతికి(23), నగరంలోని మరో ముగ్గురు మహిళలకు(35, 39, 50), ఒక పురుషుడికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. మరో 86మంది రిపోర్టులు రావాల్సి ఉంది. ప్రస్తుతం 53 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

* క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ‌తో భార‌త్ అత‌లాకుతలం అవుతోంది. గ‌త‌వారం రోజులుగా నిత్యం 20వేల‌కు పైగా పాజిటివ్ కేసులు బ‌య‌ట‌ప‌డుతూనే ఉన్నాయి.తాజాగా దేశంలో నిన్న 22,252 కేసులు బ‌య‌ట‌ప‌డ‌డంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,19,665కి చేరిన‌ట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌శాఖ వెల్ల‌డించింది.ఇక‌ దేశంలో కొవిడ్ మ‌ర‌ణాల సంఖ్య క‌ల‌వర‌పెడుతోంది. తాజాగా నిన్న ఒక్క‌రోజే 467మంది మృత్య‌వాత‌ప‌డ్డారు.దీంతో భార‌త్‌లో కొవిడ్ మృతుల సంఖ్య 20,160కు చేరింది. క‌రోనా సోకిన మొత్తం బాధితుల్లో ఇప్ప‌టివ‌ర‌కు 4,39,948 మంది కోలుకోగా మ‌రో 2,59,557 యాక్టివ్ కేసులు ఉన్న‌ట్లు ప్ర‌భుత్వం పేర్కొంది. ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ‌తో భార‌త్ ప్ర‌పంచంలోనే మూడోస్థానంలో కొన‌సాగుతోంది.

* డిపో మేనేజర్ తో పాటు మరో ఉద్యోగికి కరోనా పాజిటివ్ నిర్దారణఇప్పటికే ఇద్దరు ఉద్యోగులకు కరోనా కన్ఫర్మ్.. నాలుగుకు చేరిన ఈ సంఖ్యతమకు రక్షణ కిట్స్ లేకుండా డ్యూటీలకు వెళ్లబోమంటూ బస్సులు ఆపేసిన డ్రైవర్స్డిపో ఎదుట ఆందోళన..

* తెనాలిలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.మంగళవారం ఒక్కరోజే 20 కేసులు.తెనాలి నియోజకవర్గంలో 130కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య.సాలిపేట-1,మారీసుపేట-19.

* ‘‘ప్రైవేటు ల్యాబుల్లో ఒకట్రెండు ఫలితాలు తప్పుగా వచ్చినట్లు తెలిసింది. మరోసారి తప్పుడు రిపోర్టు వస్తే లైసెన్స్‌ రద్దు చేయడానికి వెనుకాడం’’ అని ఆంధ్రప్రదేశ్‌ వైద్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. కరోనా బాధితులతో మంత్రి మాట్లాడారు. వారికి అందుతున్న ఆహారం, వైద్య చికిత్సపై ఆరా తీశారు. ఆస్పత్రిలో అందుతున్న సేవలపై కొవిడ్‌ బాధితులు సంతృప్తి వ్యక్తం చేశారని మంత్రి చెప్పారు.ఏ సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని వైద్యులను మంత్రి నాని కోరారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ‘‘ఒక్కో కరోనా బాధితుడి ఆహారానికి రూ. 500 కేటాయించాం. ఆహార సరఫరాలో అవినీతి చేస్తే గుత్తేదారులను వెంటనే తొలగిస్తాం. టెస్టుల సంఖ్య పెంచడం వల్ల ఫలితాల వెల్లడిలో జాప్యం నిజమే’’అని చెప్పారు.

* ఏపీలో విజృంభిస్తున్న కరోనాతాజాగా 24 గంటల్లో 1178 కరోనా పాజిటివ్ కేసులు నమోదు16 వేల 238 శాంపిల్స్ ని పరీక్షించగా 1178 కరోనా పాజిటివ్ గా నిర్ధారణవీటిలో ఏపీలో 1155 కరోనా పాజిటివ్ కేసులుఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 22 మంది.గుంటూరు జిల్లా లో అత్యధికంగా 238 కరోనా పాజిటివ్ కేసులు నమోదుఇతర దేశాల నుంచి వచ్చిన వారికి 1 కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణగడచిన 24 గంటల్లో వివిధ ఆసుపత్రుల నుంచి 762 మంది పూర్తిగా కోలుకొని డిఛార్జి24 గంటల్లో మరణించిన వారి సంఖ్య13.కర్నూలు లో నలుగురు, అనంతపురంలో 3, చిత్తూరు, విశాఖలో ఇద్దరు, ప్రకాశం, పచ్చిమ గోదావరిలో ఒక్కక్కరి చొప్పున కరోనా పాజిటివ్ తో మృతిఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 232రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21197రాష్ట్రంలో అత్యధికంగా కర్నూల్ జిల్లా లో 2671 కరోనా పాజిటివ్ కేసులు.