DailyDose

హాథీరాంజీ మఠంలో భారీ దొంగతనం-నేరవార్తలు

హాథీరాంజీ మఠంలో భారీ దొంగతనం-నేరవార్తలు

* హథీరాంజీ మఠంలో బంగారం, వెండి మాయం. హథీరాంజీ మఠంలో కలకలం రేపింది.అకౌంటెంట్ బీరువాలోని నగల లెక్కల్లో తేడాలను అధికారులు గుర్తించారు.అకౌంటెంట్ గుర్రప్ప ఇటీవల మృతి చెందారు. అందరి సమక్షంలో బీరువా తెరచి అధికారులు పరిశీలించారు.108 గ్రాముల బంగారు డాలర్, వెండి వస్తువులు మాయమయ్యాయి. మఠం సిబ్బందిలో ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు.

* తహసీల్దార్ ను‌నరికి చంపిన రిటైర్డ్ హెడ్ మాస్టర్చిత్తూరు జిల్లా‌ బాడర్… కర్ణాటక సరిహద్దు కోలార్ లో ధారుణ ఘటనకర్ణాటక… చిత్తూరు రాష్ట్రాల సరిహద్దు కోలార్ జిల్లా… బంగారుపేట లో దారుణం చోటు చేసుకుంది.భూ తగాదా పరిష్కరించేందుకు సర్వేకు వేళ్ళిన తహశీల్దార్ పై కత్తితో దాడి చేసాడు రిటైర్ హెడ్ మాస్టర్.రక్తపు మడుగులో ఉన్న తహసీల్దారు ను ఆసుపత్రికి తరకిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు…తహసిల్ధార్ చంద్రమౌళీశ్వర్. కర్నాటక రాష్ట్రం.. కోలార్ జిల్లా..బంగారపేట తాలూకాలోని ఓ గ్రామంలో భూ వివాదాన్ని పరిశ్కరించేందుకు వెళ్ళిన తహశీల్దార్ చంద్రమౌళీశ్వర్ పై ఓ రిటైర్ హెడ్ మాస్టర్ వెంకట చలపతి హఠాత్తుగా కత్తితో దాడి చేసి గాయపరిచాడు.రక్తపు మడుగులో పడి ఉన్న తహసీల్దార్ ను స్థానికులు బంగారుపేట ఆసుపత్రి తరలించారు

* తూర్పుగోదావరి జిల్లా, మామిడికుదురు మండలం పాశర్లపూడి లంక ఏటుబాడవ కొబ్బరి తోటలో ఓ.ఎన్.జి.సి పైప్ లైన్ నుండి ఎగసి పడుతున్న గ్యాస్.

* జిల్లాలో బ్యాంకులను బురిడీ కొట్టించి… రూ.700 కోట్లు రుణం పొందిన వ్యవహారంలో నమోదైన కేసులను సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి తెలిపారు.బ్యాంకులను మోసగించిన అంశంపై గతేడాది మే, అక్టోబర్ నెలలో… కాకినాడ, అనపర్తి, బిక్కవోలు పోలీస్ స్టేషన్ల పరిధిలో 5 కేసులు… రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో 8 కేసులు నమోదయ్యాయి.యాక్సిస్, లక్ష్మీ విలాస్, గుంటూరు-డీసీసీబీ, కరూర్ వైశ్య బ్యాంకులు సహా…. మహారాష్ట్ర ఇన్ఫినిటీ బ్యాంకులోనూ రుణాలు పొందినట్లు అప్పట్లోనే పోలీసులు గుర్తించారు.

* సౌండ్ బాక్స్ లో మద్యం సీసాలు.తరలిస్తున్న నలుగురి ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.తెలంగాణ రాష్ట్రం ఖమ్మం నుండి ఆంధ్రప్రదేశ్ ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి గ్రామానికి అక్రమంగా తరలిస్తున్న ఒక 1085 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్న వీరులపాడు పోలీసులు.

* ఈ యస్ ఐ స్కామ్ లో మరో ఉద్యోగిని అదుపులోకి తీసుకున్న ఎసిబి…గతంలో మంత్రి పితాని వద్ద పియస్ గా పనిచేసిన మురళి అనే ఉద్యోగిని విచారించనున్న ఎసిబి…ప్రస్తుతం సచివాలయంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో యస్ ఓ గా పనిచేస్తున్న మురళీ…సచివాలయంలో గుట్టుచప్పుడు కాకుండా యస్ ఓ మురళీని అదుపులోకి తీసుకున్న ఎసిబి సెంట్రల్ ఇన్ వెస్టిగేషన్ యూనిట్ ఛీఊ అదికారులు.

* పశ్చిమ గోదావరి జిల్లాలో అక్రమ మద్యం రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గురువారం నాడు తెలంగాణ నుంచి ఆంధ్రాకు మద్యం అక్రమంగా తరలిస్తున్న ఎస్ఐ, ఎక్సైజ్ సీఐ అరెస్ట్ అయ్యారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు చింతలపూడి మండలం లింగంగూడెం బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద తనిఖీ చేయగా అక్రమ మద్యం తరలిస్తున్న పలువుర్ని అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో కృష్ణా జిల్లా బంటుమిల్లి ఎక్సయిజ్ సీఐ పులి హనుశ్రీ, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్.ఐ. విజయ కుమార్ (వీఆర్‌లో ఉన్నారు), ఏలూరుకు చెందిన నున్న కమల్, సంతోష్‌లు ఉన్నారు. నిందితుల నుంచి ఒక స్విఫ్ట్ డిజైర్ కారు, 557 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మద్యం విలువ ఆంధ్రాలో సుమారు ఐదు లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. కాగా.. మరో నిందితుడు నాగరాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు.