Sports

ఓటమి చవిచూసిన హంపి

Koneru Humpy Loses Chess Tournament

‘ఫిడే’ మహిళల స్పీడ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ గ్రాండ్‌ప్రి మూడో అంచె పోటీల్లో భారత పోరాటం ముగిసింది. గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక క్వార్టర్‌ ఫైనల్లో ఓటమి పాలయ్యారు. వరల్డ్‌ నంబర్‌ 2 హంపి 2–9తో అలెగ్జాండ్రా కోస్టెనిక్‌ (రష్యా) చేతిలో చిత్తు కాగా, వరల్డ్‌ నంబర్‌వన్‌ హూ యిఫాన్‌ (చైనా) 7–3తో హారికపై విజయం సాధించింది. ఈ టోర్నీలో చివరిదైన నాలుగో అంచె పోటీలు బుధవారంనుంచి జరుగుతాయి. ఇందులో హంపి, హారిక పాల్గొంటారు.