ScienceAndTech

750 మెగావాట్ల సోలార్ విద్యుత్ క్షేత్రం

750 మెగావాట్ల సోలార్ విద్యుత్ క్షేత్రం

రెవాలో నిర్మించిన 750 మెగావాట్ల సోలార్ విద్యుత్తు ప్రాజెక్టును ప్ర‌ధాని మోదీ ఇవాళ జాతికి అంకితం చేశారు. 

రెవా సౌర విద్యుత్తు ప్రాజెక్టుతో కేవ‌లం స‌మీప ప‌రిశ్ర‌మ‌ల‌కు విద్యుత్తు అంద‌డ‌మే కాకుండా, ఢిల్లీలోని మెట్రో రైలుకు కూడా విద్యుత్తు స‌ర‌ఫ‌రా జ‌రుగుతుంద‌ని మోదీ తెలిపారు.

షాజాపూర్‌, నీముచ్‌, చాతార్‌పూర్ ప్రాంతాల్లోనూ సోలార్ ప‌వ‌ర్ ప్రాజెక్టు ప‌నులు జ‌రుగుతున్న‌ట్లు మోదీ చెప్పారు.

సౌర విద్యుత్తు నేటి త‌రం కోసం మాత్ర‌మే కాదు అని, 21వ శ‌తాబ్ధ‌పు అవ‌స‌రాల‌ను ఇది తీరుస్తుంద‌న్నారు.  సౌర విద్యుత్తు స్వ‌చ్ఛ‌మైంది, భ‌ద్ర‌మైంద‌న్నారు.