Health

రక్తహీనత వేధిస్తోందా?

రక్తహీనత వేధిస్తోందా?

పండుగల వేళ పిండివంటల్లో ఎక్కువగా బెల్లాన్ని వాడటం తెలిసిందే. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో బెల్లం, వేయించిన వేరుశనగపప్పులను మేలైన చిరుతిండిగా పరిగణిస్తారు. బెల్లం పోషకాల గని అని పోషకాహార నిపుణులు కూడా సూచిస్తున్నారు. బెల్లం శరీరానికి కావలసిన తక్షణ శక్తినిచ్చి అలసటను దూరం చేస్తుంది. టీలో పంచదారకు బదులు చెంచా బెల్లం పొడి వాడటం వల్ల మధుమేహ బెడద ఉండదు. బెల్లంలోని పొటాషియం రక్తపోటు నివారణ, నియంత్రణకు దోహదం చేయటమే గాక మూత్రపిండాలలో రాళ్ళ సమస్యను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. మానసిక ఒత్తిడిని దూరం చేసి కంటి నిండా కునుకు పట్టటానికీ ఇందులోని పొటాషియం ఉపయోగపడుతుంది. పిల్లల ఎదుగుదలకు, ఎముకల బలంగా ఉండటానికీ బెల్లంలోని కాల్షియం అక్కరకొస్తుంది. ఇప్పటిరోజుల్లో నూటికి 40 మంది మహిళలు రక్తహీనతతతో బాధపడుతున్నారు.రక్తహీనత బాధితులు రోజూ 50 గ్రాములు బెల్లం తింటే తగినంత ఐరన్‌ అంది సమస్య దూరమవుతుంది.