ScienceAndTech

కంప్యూటర్లకు ఇంటర్నెట్ ఉండకూడదని హోమ్‌శాఖ ఆదేశం

కంప్యూటర్లకు ఇంటర్నెట్ ఉండకూడదని హోమ్‌శాఖ ఆదేశం

ప్రభుత్వాధికారులకు కేంద్ర హోంశాఖ కీలక మార్గదర్శకాలు

ఇంటర్నెట్‌ లేని కంప్యూటరే వాడాలని సూచన

సైబర్ నేరగాళ్లు సమాచార దోపిడీకి పాల్పడ వచ్చని ప్రభుత్వానికి చెందిన రహస్యాలు బయటకు పొక్కకుండా చూసేందుకు, ప్రభుత్వ వ్యవస్థలు సైబర్ దాడులకి గురికాకుండా ముందస్తు మార్గదర్శకాలు జారీ

ప్రభుత్వ అధికారులకి మార్గదర్శకాలు జారీ చేసిన హోంమంత్రిత్వశాఖలోని సైబర్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ (సీఐఎస్‌) విభాగం

మార్గదర్శకల్లోని కీలక అంశాలు

ప్రభుత్వశాఖలకు సంబంధించి కీలకమైన పనులను ఇంటర్నెట్‌ సదుపాయం లేకుండా, ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కంప్యూటర్‌ ద్వారానే చేయాలి

ప్రతి ఒక్కరూ అక్షరాలు, అంకెలు, ప్రత్యేక గుర్తులతో కూడిన అత్యంత దృఢమైన పాస్‌వర్డ్‌ రూపొందించుకోవాలి.

ప్రతి ప్రభుత్వ ఉద్యోగీ తాను వాడుతున్న కంప్యూటర్‌లోని ఆపరేటింగ్‌ వ్యవస్థ, సాఫ్ట్‌వేర్‌, యాంటీవైరస్‌లు ఎప్పటికప్పుడు తాజాగా ఉండేలా చూసుకోవాలి. వీటికి సంబంధించిన ఆటో అప్‌డేట్‌ వ్యవస్థనూ ఆన్‌లోనే ఉంచుకోవాలి.

ఎప్పటికప్పుడు సమాచారాన్ని బ్యాకప్‌ తీసుకోవాలి

ప్రభుత్వానికి చెందిన సమాచారం ఏదీ ప్రైవేట్‌ క్లౌడ్‌ సర్వీస్‌లో నిల్వ చేయకూడదు

ఒకవేళ ప్రభుత్వ అధికారులు ఎవరైనా అలా చేస్తే చట్టపరమైన చర్యలుంటాయి

పాస్‌వర్డ్స్‌ను తరచూ మార్చుతుండాలి

ప్రభుత్వం ఇచ్చిన ఈ-మెయిల్‌ చిరునామానే వాడాలి

కీలకమైన సమాచారం ఏదీ ఈ-మెయిల్‌ ద్వారా పంపవద్దు

ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో పంపాల్సి వస్తే సంబంధిత అధికారి అనుమతి తీసుకోవాలి

ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వం తరఫున పనిచేస్తున్న వారెవరూ ప్రభుత్వం సమకూర్చిన ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల ద్వారా సామాజిక మాధ్యమాలను వాడకూడదు.