Movies

సినిమాల్లోకి ప్రభాస్ సోదరి ప్రసీద

Prabhas Sister Praseeda To Enter Movies And Tollywood

చాలా మంది నటవారసులు తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చారు. కొందరు హీరోలుగా, మరికొందరు దర్శకనిర్మాతలుగా కొనసాగుతున్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు కుటుంబం నుంచి మరొకరు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నారని సమాచారం. వారు ఎవరో కాదు కృష్ణంరాజు పెద్ద కుమార్తె ప్రసీద. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్‌ చిత్ర నిర్మాణంలో కూడా ఆమె పాలుపంచుకుంటుంది. రాధేశ్యామ్ సినిమా నిర్మాతల్లో వంశీ, ప్రమో‌ద్‌తో పాటు ప్రసీద కూడా ఉన్నాది. సినిమాలతో పాటుగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌కు సినిమాలను, వెబ్ సిరీస్‌లను నిర్మించేందుకు ఆమె సిద్ధంగా ఉన్నాదట.