DailyDose

ఇండియాలో 8లక్షలు దాటిన కరోనా కేసులు-TNI బులెటిన్

TNILIVE Bulletin - India Running Fast To Reach Million COVDI19 Cases

* భారత్ విజృంభిస్తున్న కరోనాదేశంలో ఎనిమిది లక్షలు దాటిన కరోనా కేసులుఐదు లక్షలు దాటిన రికవరీ కేసులునాలుగు రోజుల్లో లక్షకు పైగా కేసులు,2 వేల మంది మృతిగడిచిన 24 గంటల్లో 27,114 కేసులు, 519 మంది మృతిదేశవ్యాప్తంగా 8,20,916 కేసులు,22,123 మంది మృతిప్రస్తుతం దేశంలో 2,83,407 యక్టీవ్ కేసులు, 5,15,386 మంది డిశ్చార్జ్భారత్ లో 63 శాతానికి చేరువలో రికవరీ రేటు

* మంత్రులు, ఎమ్మెల్యేలకు కరోనా ఎఫెక్ట్డిప్యూటీ సిఎం నారాయణస్వామి చిన్నల్లుడికి కరోనా పాజిటివ్కెనడా నుంచి వచ్చిన చిన్నల్లుడుహోం ఐసోలేషన్ లోకి నారాయణస్వామినగరి ఎమ్మెల్యే రోజా గన్ మెన్ కి కరోనా పాజిటివ్గన్ మెన్ కు పాజిటివ్ రావడంతో హోం ఐసోలేషన్ లోకి వెళ్లిన రోజా

* తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం నాడు మూడవ విడత 78 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు గతంలో పాజిటివ్ సోకిన వ్యక్తులకు సంబంధించిన కుటుంబ సభ్యులకు వారు కాంట్రాక్టు లో ఉన్న వ్యక్తులకు ఈ పరీక్షలు నిర్వహించారు తిరువూరు రోలుపడి చెందిన వారు ఎక్కువగా ఉన్నారు డాక్టర్ ఆర్ లక్ష్మీనారాయణ ద్ర్గంగాధర్ కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది ఈ పరీక్షలు నిర్వహించారు.

* అమెరికాలో కరోనా వైరస్‌ విజృంభణ అత్యంత ప్రమాదకరంగా ఉంది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 33 లక్షలకు చేరువైంది. గత మూడు రోజుల నుంచి రోజుకు 60 వేల కొత్త కేసులు బయటపడగా.. నిన్న ఒక్క రోజే 72 వేల కేసులు నమోదయ్యయి. గడిచిన 24 గంటల్లో 849 మంది మృతి చెందారు. అమెరికాలో మొత్తం కొవిడ్‌ కేసుల సంఖ్య 32,91,786కి చేరగా మృతుల సంఖ్య 1,36,671కి పెరిగింది

* దేశంలో కరోనా కేసుల అంకంలో మరో రికార్డు నమోదైంది. ఇదివరకు ఎన్నడూలేనంత గరిష్ఠస్థాయిలో గత ఒక్కరోజులో 27,114 కేసులు రాగా.. 519 మరణాలు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 8,20,916కి చేరింది. వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 2,83,407 మంది చికిత్స పొందుతుండగా.. 5,15,386 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి అయినట్లు కేంద్రం తెలిపింది. కరోనాతో ఇప్పటి వరకు 22,123 మంది ప్రాణాలు కోల్పోయారు.

* కరోనా మహమ్మారిని పూర్తిగా అంతం చేసే అవకాశం తక్కువేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఎమర్జెన్సీ ప్రోగ్రామ్ చీఫ్ డా. మైక్ రయాన్ తెలిపారు.‘ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్‌ను పూర్తిగా నిర్మూలించే అవకాశం తక్కువే’ అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఎక్కువ కేసుల ఉన్న ప్రాంతాల్లో వైరస్‌ను నిర్మూలించడం ద్వారా కరోనా రెండోసారి విజృంభించకుండా చేయొచ్చని తెలిపారు. తద్వారా లాక్ డౌన్‌లు విధించే అగత్యం తప్పుతుందన్నారు.