DailyDose

భారత్‌లో మరోసారి పెరిగిన చమురు ధరలు-వాణిజ్యం

భారత్‌లో మరోసారి పెరిగిన చమురు ధరలు-వాణిజ్యం

* దేశంలో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల పెంపు కొన‌సాగుతూనే ఉంది. తాజాగా డీజిల్‌పై 16పైస‌లు పెరిగింది. పెట్రోల్‌ ధ‌ర మాత్రం స్థిరంగా ఉంది. దీంతో హైద‌రాబాద్‌లో లీట‌రు డీజిల్ ధ‌ర రూ.79.04కు చేర‌గా పెట్రోలు ధ‌ర రూ.83.49గా ఉంది. దేశరాజ‌ధాని దిల్లీలో డీజిల్ ధ‌ర రూ.80.94కాగా, పెట్రోల్ ధ‌ర రూ.80.43గా ఉంది. చెన్నైలో పెట్రోల్‌పై 8పైస‌లు, డీజిల్‌పై 18పైస‌లు పెరిగింది. వ‌రుస ధ‌ర‌ల పెంపుతో దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌ల్లో నిర‌స‌న వ్య‌క్తమైన విష‌యం తెలిసిందే. దీంతో గ‌త ప‌దిరోజులుగా దేశంలో పెట్రోల్ ధ‌ర‌లు దాదాపు స్థిరంగా ఉన్నాయి. తాజాగా డీజిల్‌ స్ప‌ల్వ పెరుగుద‌ల‌తో ఆదివారం నాటికి ప్ర‌ధాన న‌గ‌రాల్లో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.

న‌గ‌రం పెట్రోల్ డీజిల్ (ధ‌ర రూ.పైస‌ల్లో)
హైద‌రాబాద్ 83.49 79.05
దిల్లీ 80.43 80.94
చెన్నై 83.63 78.09
ముంబ‌యి 87.19 79.17
కోల్‌క‌తా 82.10 76.05

* రిలయన్స్‌ జియోలో దాదాపు 25.09శాతం వాటాలను విక్రయిస్తూ రిలయన్స్‌ చేసుకొన్న డీల్స్‌ వేగంగా అమల్లోకి వస్తున్నాయి. ఇప్పటికే వీటిల్లో నాలుగు డీల్స్‌ నుంచి రూ.30,062 కోట్లు అందినట్లు ఆ సంస్థ నిన్న సెబీకి అందజేసిన రెగ్యూలేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. దాదాపు 6.13శాతం విలువైన వాటాలకు సంబంధించి ఎల్‌ కాటర్టన్‌, ది పబ్లిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్, సిల్వర్‌ లేక్‌, జనరల్‌ అట్లాంటిక్‌ వంటి సంస్థలతో కుదుర్చుకొన్న ఒప్పందాలు పూర్తయినట్లు ఈ ఫైలింగ్‌లో వెల్లడించింది. అంతకు ముందు కూడా ఫేస్‌బుక్‌తో డీల్‌ పూర్తికావడంతో రూ.43,574 కోట్లను రిలయన్స్‌ అందుకొంది. అప్పట్లో ఫేస్‌బుక్‌ చెందిన జాద్దూ హోల్డింగ్స్‌కు 9.99 శాతం వాటాను కేటాయించినట్లు జులై7నాటి రెగ్యూలేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. రిలయన్స్‌ జియోలో మొత్తం 25.09 వాటాను 11 మంది ఇన్వెస్టర్లకు విక్రయించింది. ఈ డీల్స్‌ విలువ రూ.1,17,588.45 కోట్లు.

* డెలివరీ సేవల స్టార్టప్‌ డన్జోలో వినియోగదారుల డేటా హ్యాకింగ్‌కు గురైంది. ఈ విషయాన్ని సంస్థ శనివారం వెల్లడించింది. ఆ సంస్థ వినియోగదారుల ఫోన్‌నంబర్లు, ఈమెయిల్‌ అడ్రస్‌లు లీకైనట్లు పేర్కొంది. థర్డ్‌పార్టీ భాగస్వామి సర్వర్‌ నుంచి ఇవి బయటకు వెళ్లినట్లు తెలిపింది. కంపెనీ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ ముకుంద్‌ ఝా మాట్లాడుతూ వినియోగదారులు చెల్లింపులు జరిపే కార్డుల నంబర్లు, ఇతర వివరాలు లీక్‌ అయ్యే అవకాశం లేదన్నారు. తాము అటువంటి డేటాను నిల్వచేయమన్నారు. ఈ డేటా లీక్‌ విషయం తెలియగానే తాము వెంటనే చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. తమ వినియోగదారులు పాస్‌వర్డ్‌లు మార్చుకోవాల్సిన అవసరం లేదని.. వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌లతోనే యాప్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు. భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.

* కరోనా వైరస్‌ ఉదృతి వల్ల 14కోట్ల70లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని సిడ్నికి చెందిన ‘ప్లోస్‌ వన్‌’ అనే రీసెర్చ్‌ సంస్థ నివేదిక తెలిపింది. అదేవిధంగా కరోనా వైరస్‌ కారణంగా అంతర్జాతీయంగా 3.8ట్రిలియన్ల ఉత్పత్తిని కంపెనీ యాజమాన్యాలు నష్టపోయారని నివేదిక పేర్కొంది. అయితే తమ సర్వేలో తయారీ రంగం, పర్యాటక రంగం, రవాణా రంగాలు తీవ్రంగా నష్టపోయినట్లు సిడ్నీ యూనివర్సిటీకి చెందిన అరుణిమా మాలికా తెలిపారు. మరోవైపు ఉత్పత్తికి అంతరాయం కలగడం వల్ల 2.1ట్రిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని ఉద్యోగులు నష్టపోయినట్లు పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఉద్యోగాలు కోల్పోయినట్లు నివేదిక పేర్కొంది.

* దేశంలో ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంత డిమాండ్‌ ఉందో మనందరికి తెలిసిందే. కానీ సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమ, ప్రైవేట్‌ రంగాలలో ఇటీవల కాలంలో కంపెనీలు అత్యధిక వేతనాలు ఆఫర్‌ చేస్తుండడంతో విద్యార్థులు ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేటు రంగానికి సమ ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో కంపెనీలు నియామకాల ప్రక్రియను చేపట్టడం లేదు. ఈ నేపథ్యంలో విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు 6,500మంది ప్రజలతో అడ్డా 247అనే సంస్థ నిర్వహించింది.