Health

సహజ ప్రసవానికి చిట్కాలు

సహజ ప్రసవానికి చిట్కాలు

నార్మల్ డెలివరీ అయ్యేందుకు చిట్కాలు..

నార్మల్ డెలివరీ అంటే అందరికీ ఇష్టమే. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో అది చాలా కష్టమైన పని. కొన్ని చిట్కాలు పాటించడం వల్ల సుఖప్రసవం అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అవేంటో తెలుసుకోండి.

నార్మల్ డెలివరీకీ నేచురల్ డెలివరీకీ కొన్ని తేడాలున్నాయి. నార్మల్ డెలివరీలో కొంతైనా బయటి నుంచి చేసే సాయం ఉంటుంది. నొప్పి తగ్గడానికి ఇచ్చే ఇంజెక్షన్స్ ఉంటాయి. ఎపిసియాటమీ అంటే బిడ్డ బైటికి రావడానికి వీలుగా యోని ద్వారాన్ని కొంచెం వెడల్పు చేస్తారు. ఇంకా అవసరమైతే ఫోర్సెప్స్‌తో బిడ్డని బయటికి తీస్తారు. నాచురల్ డెలివరీలో అవేమీ ఉండవు. ఇందులో నొప్పిని తట్టుకునే పద్ధతులు నేర్పిస్తారు. మరి ఈ నాచురల్ డెలివరీ కోసం మీరు చెయ్యాల్సిన కొన్ని పనుల గురించి తెలుసుకోండి..

​నార్మల్ డెలివరీ గురించి..

ఎందుకు నాచురల్ డెలివరీ వైపు మొగ్గు చూపుతున్నారు? అంటే..కొంత మంది మెడికల్ రీజన్స్ వల్ల నాచురల్ డెలివరీ ఇష్టపడితే కొంతమంది ప్రకృతి పరంగానే పిల్లల్ని కనడానికి ఇష్టపడతారు. ఈ నేపథ్యంలోనే నేచురల్ డెలివరీని సపోర్ట్ చేసే డాక్టరని వెతకడం చాలా కష్టం. మీ డెలివరీ పద్ధతి మీద మీ డాక్టర్ కే నమ్మకం లేకపోతే అటువైపు నుంచి మీకొచ్చే సాయం ఏమీ ఉండదు. వాళ్ళకి పైగా అప్పటికే ఈ విధానంలో కొంత ప్రాక్టీస్ ఉండి ఉంటుంది.

​నొప్పులు వస్తుంటే..

ఎర్లీ లేబర్ అంటే కొద్ది కొద్ది గా నొప్పులు రావడం. ఆ సమయంలో మీరు ఇంట్లోనే ఉండొచ్చు. నెమ్మదిగా అటూ ఇటూ తిరగొచ్చు, ఏదైనా తినచ్చు, తాగచ్చు. నొప్పులు ఎక్కువైనప్పుడు అంటే ఐదు నిమిషాలోపే నొప్పులు వస్తుంటే అప్పుడు హాస్పిటల్‌కి వెళ్ళండి. అయితే ఇది హాస్పిటల్ మీ ఇంటికి దగ్గరగా ఉన్నపుడు మాత్రమే చెయ్యాల్సిన పని. అంతేకానీ, దూరంగా ఉన్నప్పుడు ఇలానే చేస్తే మొదటికే మోసం వస్తుంది.

​బరువు అదుపులో..

బరువు ఎక్కువ లేని వారికి డెలివరీ టైమ్‌లో కాంప్లికేషన్స్ కూడా తక్కువే. కాబట్టి ప్రెగ్నెన్సీ టైం లో బరువు కంట్రోల్ లో పెట్టుకోండి. అదే విధంగా.. లో-ఇంటర్వెన్షన్ ప్రెగ్నెన్సీని ఎంచుకోండి. అంటే ప్రెగ్నెన్సీ టైమ్‌లో వాడాల్సిన మందులూ, చేయించుకోవాల్సిన టెస్ట్ లూ లాంటివి గురించి తెలుసుకోవడం. కొన్ని మందులూ, కొన్ని పరీక్షలూ తప్పనిసరి. అవి అందరూ చేయించుకోవాల్సిందే. కొన్ని ఆప్షనల్ గా ఉంటాయి. వాటిని ఫాలో అవ్వాలా వద్దా అని ఎవరికి వారు డిసైడ్ చేసుకోవచ్చు. వాటి గురించి అన్ని వివరాలూ, ప్లస్ పాయింట్లూ, మైనస్ పాయింట్లూ అన్నీ తెలుసుకుని అప్పుడు ఓ నిర్ణయానికి రండి.

​ఫిజికల్, మెంటల్‌గా ప్రిపేర్..

అనుకోవడం వేరు, చేయడం వేరు. అందుకని అన్ని వివరాలూ సేకరించండి. అవసరం అనుకుంటే నాచురల్ డెలివరీలో ఏం జరుగుతుందో చూడండి. అప్పుడు ఈ డెలివరీ కోసం ఎలా ప్రిపేర్ అవ్వాలో మీకే ఓ ఐడియా వస్తుంది. నొప్పిని తట్టుకునేందుకు సిద్ధపడండి. డెలివరీ టైం లో వచ్చే నొప్పిని తట్టుకునేందుకు రకరకాల పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. టబ్ లో పడుకోడం, మసాజ్…ఇలా ఉన్న పద్ధతుల్లో మీ హాస్పిటల్ లో ఏవి అందుబాటులో ఉన్నాయో ముందే తెలుసుకోండి. దాన్ని బట్టి మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి.

​నార్మల్‌గా కాకపోయినా..

మీరు అనుకున్నట్లే నాచురల్ డెలివరీ ద్వారా బిడ్డని కనలేకపోయినా బాధపడొద్దు. ఒక్కోసారి మీ పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవచ్చు, ఒక్కోసారి మీరే తట్టుకోలేకపోవచ్చు. లాస్ట్ మినిట్‌లో సిజేరియన్‌కి గానీ వెళ్ళాల్సి రావచ్చు. దాని గురించి ఎక్కువ ఆలోచించకండి. అలానే మీ నార్మల్ డెలివరీ కోసం ఎదురుచూసే వ్యక్తి మీ పక్కనే ఉండాలి. అది తల్లి అయినా కావచ్చు, ఫ్రెండ్ అయినా కావచ్చు… ఎవరైనా సరే ఈ పద్ధతి అర్ధం చేసుకుని ఇష్టపడిన వ్యక్తి మీ పక్కనే ఉండడం అవసరం. వాళ్ళకి నాచురల్ డెలివరీ గురించిన అన్ని విషయాలూ తెలిసి ఉండాలి కూడా. ఇది చాలా ముఖ్యం. ఇలా ప్రతి విషయంలోనూ మీరు మిమ్మల్ని మీరూ రెడీ చేసుకుంటే డెలివరీ ఈజీగా హ్యాపీగా అవుతుంది.